పీహెచ్ సి లో గర్భిణీలకు వైద్య పరీక్షలు...
రవికిరణాలు న్యూస్...తిరుపతి జిల్లా... దొరవారిసత్రం మండలం...
గర్భం దాల్చిన ప్రతి గర్భిణీ ప్రతి నెలల లో
గైనకాలజిస్ట్ వద్ద పరీక్షలు చేయించుకోవాలని డా!! పద్మావతి సూచించారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి పలు సూచనలు చేశారు. బాల్య వివాహాలు చేసుకోకూడదు, 19 ఏళ్ల వివాహితులందరూ గర్భము దాల్చితే ప్రసమవరకు మంచి పౌష్టికాహారం, రక్తహీనత లేకుండా చూసుకుంటూ ప్రతి నెలలో బిడ్డ పెరుగుదలపై గైనకాలజిస్ట్ వద్దనే పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. ప్రధానంగా బిడ్డకు బిడ్డకు దూరం ఉండేలా తాత్కాలిక తాత్కాలిక కుటుంబ నియంత్రణలు పాటించాలని తెలిపారు. ప్రైవేటు వైద్యశాలకు వెళుతున్న మీరందరూ తప్పనిసరిగా పి హెచ్ సి లో జరిగే పి ఎం ఎస్ ఎం ఏ కార్యక్రమంలోఉచిత వైద్య, రక్త పరీక్షలు చేయించుకోవాలనిసూచించారు.అనంతరం ఒక్కో గర్భవతిని పరీక్షించి వారికి రక్తపోటు, హెచ్ బి, బరువు, హెచ్ బి ఎస్ ఏజ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సంపూర్ణమ్మ, పిహెచ్ఎన్ పద్మావతి, హెల్త్ విజిటర్ మైధిలి, ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎమ్స్, హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమార్, సుధాకర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment