"కోటంరెడ్డికి కాకాణి సవాల్"


"కోటంరెడ్డికి కాకాణి సవాల్"

తేది:04.02.2023
అనంతపురం:

కలుపు మొక్కలు వెళ్ళిపోతే.. పోయేదేమీ లేదుః మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

అనంతపురంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్‌ రెడ్డిః

- విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి కోటంరెడ్డి
- దమ్మూ, ధైర్యం ఉంటే ఆ ఆడియో క్లిప్‌ విచారణ ఏజెన్సీలకు ఇవ్వాలి
- జగన్‌ గారు బీఫామ్ ఇవ్వకపోతే నీ స్థానం ఎక్కడ..?
-: వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

- అబద్ధాలు చెప్పడంలో శ్రీధర్‌ రెడ్డిని మించిన వాడు లేడు
- శ్రీధర్‌రెడ్డి వెళ్లడం వల్ల పార్టీకి పట్టిన పీడ, దరిద్రం పోయింది
- సజ్జలపై చేసిన ఆరోపణలపై దేవుని వద్ద ప్రమాణానికి సిద్ధమా..?
-: వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే:

విశ్వాస ఘాతకుడు కోటంరెడ్డిః
- తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు... ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లే విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.
-పెద్ద గొంతు వేసుకుని శ్రీధర్‌ రెడ్డి మాట్లాడితే ఇక్కడ ఎవరూ భయపడరు-శ్రీధర్‌ రెడ్డి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా జగన్మోహన్‌రెడ్డి గారు అవకాశం ఇచ్చారు
-నువ్వు సున్నా... ఒకటి అనే జగన్‌ గారి పక్కన ఉండబట్టే నీకు విలువ వచ్చిందని నేను ఎప్పుడో చెప్పాను
-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసే ఆరోపణలు పసలేనివి... చేతనైతే, నీ దగ్గర ఉన్న ఆడియో క్లిప్‌పై విచారణ చేయించు.
-ట్యాపింగ్‌ అనేదానికి నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి...? నువ్వు కోర్టుకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి విచారణ చేయించుకోవచ్చు.
-ఆ సాక్ష్యం ఏ ఏజెన్సీ దగ్గర పెట్టాలో అక్కడ పెట్టు.. వాస్తవమేమిటో నిగ్గు తేలుతుంది
-శ్రీధర్‌రెడ్డి లాంటి వాడు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు పోయేదేమీ లేదు. పార్టీకి పట్టిన పీడ, దరిద్రం పోయింది
-ఇప్పుడు టీడీపీకి ఆ దరిద్రం పట్టింది...ఆయన టీడీపీలో చేరడం వల్ల నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం కుప్పకూలిపోయింది అనే వార్తలు మనం మున్ముందు వినబోతున్నాం
-ఇక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హౌస్‌ ఫుల్‌గా ఉంది కాబట్టి... టీడీపీ కాళీగా ఉందని అక్కడకు వెళ్తున్నారు

జగన్‌ గారు బీఫాం ఇవ్వకపోతే నీ స్థానం ఎక్కడ..?
-జగన్మోహన్‌ రెడ్డి గారు నీకు బీ-ఫామ్ ఇ్వకపోతే నువ్వు జన్మలో శాసనసభ్యుడివి అయ్యుండేవాడివా..? ఆర్ధికంగా ఈ స్థాయికి ఎదిగి ఉండే వాడివా..?
-కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి వాళ్లపై దౌర్జన్యం చేస్తావా..? నువ్వు తప్పుచేస్తే కేసులు పెట్టరా..?
-నువ్వేమన్నా మొనగాడివా... చట్టానికి అతీతుడివా.. తప్పు చేస్తే కేసులు పెట్టకుండా ఉండటానికి..?
-నమ్మకం లేని చోట ఉండలేను అంటున్నావ్‌...అసలు నీకు నమ్మకం లేదు కాబట్టే, పదవులు ఇవ్వలేదని వెళ్లిపోయావ్‌
-నీకు టిక్కెట్‌ ఇవ్వడమే గొప్ప...ఆ రోజు ఎంత ఒత్తిడి ఉన్నా జగన్మోహన్‌రెడ్డి గారు నీకు టిక్కెట్‌ ఇచ్చారు
-శ్రీధర్‌రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణల్లో దేవుని వద్ద ప్రమాణానికి రావాలి
-నిందలు వేయడం, బురదజల్లడం శ్రీధర్‌ రెడ్డికి ఆనవాయితీ-అతని గురించి దారిన పోయే చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. నిందలు వేసి వెళ్తున్నావు కదా...ఆధారాలు చూపించి వెళ్లు.
- శ్రీధర్‌ రెడ్డికి ఏ మాత్రమైనా, నీతి, నిజాయితీ ఉండి ఉంటే జగన్‌ గారిని విడిచిపెట్టి వెళ్ళే వాడు కాదు.
-టిక్కెట్‌ రానటువంటి వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు..వారికి రాజకీయ పునరాసం కావాలి
-ఎవరు ఎన్ని మాట్లాడినా...జగన్‌ గారు ఇచ్చిన బీ-ఫామ్ మీద గెలిచి, వెళుతున్న వారికి నేను పదే పదే ఒకటే చెప్తున్నా
-2024లో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ 100 శాతం స్థానాలు గెలుచుకుంటుంది
-ఇప్పుడు మాట్లాడే వారి పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఆరోజు మళ్ళీ మాట్లాడుకుందాం

కలుపు మొక్కలు వెళ్ళినంత మాత్రాన పోయేదేమీ లేదుః
-ప్రజల్లో టీడీపీ లేదు...రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగిస్తుంది
-మేయర్‌ వెళ్లినంత మాత్రాన ఏమవుతుంది..?
-ఆనాడు 23 మంది పార్టీని వీడి వెళ్లినప్పుడే మా నాయకుడు బెదరలేదు..
-రెండు, మూడు కలుపు మొక్కలను తీసేసినంత మాత్రాన ఏమీకాదు.
-వేరిపారేయాల్సిన వాళ్లు ముందుగానే తెలుసుకుని పలాయనం చిత్తగిస్తున్నారు.
-శ్రీధర్‌రెడ్డి నోటి వెంటనిజం వస్తే ఒట్టు...నెల్లూరు జిల్లాలో శ్రీధర్‌ రెడ్డి గురించి ఎవర్ని అడిగినా చెప్తారు అబద్ధాలను అద్భుతంగా చెప్పగలడని.
-అందరికీ తగువులు పెట్టడం ఆయనకు అలవాటు...ఆయన లోపల మనిషిని నెల్లూరు జిల్లా ప్రజలను అడిగితే చెబుతారు.
-శ్రీధర్‌ రెడ్డి ముఖం చూసి నేను వైఎస్సార్సీపీలోకి రాలేదు... జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వం చూసి వచ్చాను
-ఏ రోజైతే జగన్‌ గారు కాంగ్రెస్‌పార్టీని వీడి వచ్చాడో ఆనాడే నేను ఆయన వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నా.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget