తేది: 26-02-2023
పవన్ కళ్యాణ్ అండదండలతో జనసేన ప్రచార వాహనం "సప్తాశ్వ రథ మారూఢం"
-నెల్లూరు గ్రామ దేవత ఇరుగాళమ్మ తల్లి ఆశీస్సులతో వాహన పూజా కార్యక్రమం
-సప్తాశ్వ రథ మారూఢం అంటే సూర్య భగవానుని వాహనం
-అభివృద్ధికి దూరమై అంధకారంలో కొట్టాడుతున్న నెల్లూరు నగరంలో సూర్యుని కాంతి వలె వెలుగులు తెస్తాం
-రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తాం
-జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
-----------------
నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అండదండలతో నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన పార్టీ ప్రచార వాహనం "సప్తాశ్వ రథ మారూఢం" పూజా కార్యక్రమం పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఇరుగాళమ్మ దేవాలయంలో జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం నగరంలో నిర్విరామంగా నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 286వ రోజున స్థానిక 46వ డివిజన్ కాకర్లవారి వీధిలో జరిగింది.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గడచిన ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా కొంచెం కూడా నిరుత్సాహం చెందకుండా గడచిన మూడున్నరేళ్లుగా అలుపనేది లేకుండా ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తున్నామంటే అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే సాధ్యమైందన్నారు. పవన్ కళ్యాణ్ గారి అండదండలతోనే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తాను ముందుకు సాగుతున్నానని, పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి ప్రజల అపూర్వ ఆదరణ తనకు మరింత ఉత్సాహం ఇచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో నేడు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అండదండలతో నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన ప్రచార వాహనం "సప్తాశ్వ రథ మారూఢం" పూజా కార్యక్రమం ఇరుగాళమ్మ తల్లి ఆశీస్సులతో జరిగిందన్నారు. సప్తాశ్వ రథ మారూఢం అంటే సూర్య భగవానుని వాహనమని, నేడు అభివృద్ధికి దూరమై అంధకారంలో కొట్టాడుతున్న నెల్లూరు నగరంలో సూర్యుని కాంతి వలె వెలుగులు తెస్తామన్నారు. ప్రజలందరి ఆశీస్సులు తమకు లభిస్తున్నాయని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా తమ పయనం ఉంటుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, ఉడాలి సూర్య నారాయణ, ఈగి సురేష్, అంచల సారథి, పనికి జీవన్, చెరుకూరి హేమంత్ రాయల్, కాయల వరప్రసాద్, పేనేటి శ్రీకాంత్, షేక్ జాఫర్, అలెక్స్, వెంకటేశ్వరులు, రమణ చరణ్, సురేష్, పురుషోత్తం, చితూరు రాము, సాయి, మనేపల్లి వినయ్, ముడూరు కార్తిక్, నరసింహ, సియోన్, పవన్, చిన్నా, దయాకర్, దువాకర్, లక్ష్మణ
వీర మహిళలూ -: శిరీష రెడ్డి, ఝాన్సి, ఆమంచర్ల కుసుమా, నాగరత్నం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment