ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం : కిలివేటి సంజీవయ్య...

 ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం : కిలివేటి సంజీవయ్య...








రవికిరణాలు న్యూస్ ...తిరుపతి జిల్లా ...దొరవారిసత్రం మండలం...


ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు టీటీడీ పాలక మండల సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. శుక్రవారం ఉదయం దొరవారిసత్రం మండలంలోని తల్లంపాడు గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శ్రీ చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి గారితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈశ్వరవాక శ్రీనివాసులురెడ్డి, స్థానిక వైకాపా నాయకులు నెలవల్లి రామచంద్ర నాయుడు, సర్పంచి తిరుపలయ్య మరియు బాబు రెడ్డి తదితర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget