డి ఒ ఎస్ కాలనీ లో స్వచ్ఛభారత్.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పట్టణం లోని ఇస్రో ఉద్యోగులు నివాసం ఉండే డి ఒ ఎస్ కాలనీ లో శనివారం
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ను డిప్యూటీ డైరెక్టర్ సేథిల్ కుమార్ ప్రారంభించారు,
కాలనీ లో స్వచ్ఛభారత్ ర్యాలీ చేస్తూ చిన్నారులు,పెద్దలు అందరు కలిసి రోడ్ ప్రక్కన
పడిఉన్న చెత్తను ,ప్లాస్టిక్ కవర్లను సేకరించి ఒకేచోట కు చేర్చారు , దీంతో కాలనీ అంతా
పరిశుభ్రంగా మారిపోయింది,ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటిస్తేనే మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంటాయని మనం ఆరోగ్యాంగా ఉండవచ్చు అని ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భముగా వాల్ఫ్ జనరల్ మేనేజర్
లవిశేట్టి శ్రీనివాసులు చేతులు మీదుగా పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే స్వచ్ఛభారత్ డ్రాయింగ్ పోటీలో విజేతలైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ ఎస్ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ లీలేష్ కుమార్ గౌర్, డి ఒ ఎస్ కాలనీ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి వేణుగోపాల్, క్రీడా కార్యదర్శి శ్రీనాధ్ రెడ్డి, సాంస్కృతిక విభాగ కార్యదర్శి చిట్టిబాబు, లైబ్రరీ కార్యదర్శి హరి, సి ఐ ఎస్ ఎఫ్ ఏ ఎస్ ఐ బి ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment