ముస్లిం మైనారిటీల ముస్లింల నిరసన గొంతుక పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్

 

 రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముస్లిం మైనారిటీల ముస్లింల నిరసన గొంతుక పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.   రూరల్ నియోజకవర్గంలో ముస్లింల సమస్యలు పరిష్కరించాలని, ముస్లింలతో కలిసి కార్యాలయం వద్ద బైఠాయించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.   బారాషాహీద్ దర్గాలో మజీద్ నిర్మాణం, దర్గాలో అభివృద్ధి నిధులు, షాదీ మంజిల్, మైనార్టీ గురుకుల పాఠశాల తదితర సమస్యలపై గళమెత్తిన ముస్లిం సోదరులు.  అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయింది... గురుకుల పాఠశాల అంశాన్ని పట్టించుకోలేదు. 2 కోట్లు పెడితే పూర్తవుతుందని అనేక సార్లు అధికారులను బ్రతిమిలాడాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  డబ్బులు లేవని చెప్పే అధికారులు నెల్లూరు నగర నడిబొడ్డున 2.5కోట్లు పెట్టి కమిషనర్ ఇల్లు కడుతారా. ఇదెక్కడి న్యాయం. షాదిమంజిల్ పనుల కోసం అనేక సార్లు అడిగాను, దాన్ని విడుదల చేయలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  బరాషాహీద్ దర్గా అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు ఇచ్చింది, ఆ నిధులు ఆగిపోయాయి. దీంతో అధికారుల చుట్టూ తిరిగి కోటిన్నర పెట్టించి ఈద్గా, ఆర్చి కట్టించాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడాను. మసిద్ కి, దర్గా అభివృద్ధికి 15 కోట్లు అడిగాను. ముఖ్యమంత్రి 15 కోట్లు విడుదల చేస్తూ సీఎం సంతకం పెట్టి జీఓ ఇచ్చారు. ముస్లిం మతపెద్దలతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  అయితే ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాలేదు... నగదు విడుదల చేయలేదు, జీఓని చిత్తుకాగితంలా మార్చేశారు. ఇది అన్యాయం అని వాచ్ మెన్, అటెండర్, బంట్రోతు తిరిగినట్లు అమరావతి చుట్టూ తిరిగాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  సీఎంను కలిసే పరిస్థితి లేదు, అధికారులు పట్టించుకోలేదు...కలెక్టర్ కార్యాలయంలో ఈ సమస్యలపై అధికారులను నిలదీసాను, దీంతో జనవరి 2న సీఎం పిలిపించి మాట్లాడారు. 15రోజుల్లో నిధులు విడుదల చేస్తానని సీఎం చెప్పారు... ఇప్పటికి ఒక్కరూపాయి నిధులు విడుదల కాలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  ప్రశ్నించానాని నా ఫోన్ ని ట్యాప్ చేసి ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా విన్నారు. 3 తరాలుగా వై.ఎస్. కుటుంబం కోసం పని చేశా, నన్ను అవమానించారు. అందుకే వైసీపీకి దూరంగా జరిగాను... ప్రజాసమస్యల కోసం ప్రజాపక్షాన కోటంరెడ్డి గొంతుక వినిపిస్తూనే ఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగాం.... ఇక ప్రజలతో కలిసి ఉద్యమించక తప్పడం లేదు. నా మీద, రూరల్ ప్రజల మీద ప్రేమతో ఎలానో పనులు చేయలేదు.. నా మీద కోపంతో అన్నా పనులు పూర్తిచేయండి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  పనులు పూర్తి చేయకుంటే సీఎం జీఓని తీస్కుని హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పై కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ముస్లిం మతపెద్దలు, ముస్లిం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget