ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా ?మాలేపాటి
కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు భారీగా పోలీసులు మోహరించారు
కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారు ఆందోళన కార్యక్రమం చేయబోతున్నారని ముందుగానే ఆందోళన పడిన పోలీసులు
ఎక్సైజ్ ఆఫీసుని ముట్టడిస్తారనే సమాచారంతో పార్టీ కార్యాలయం వద్ద గస్తీకాస్తున్న పోలీసులు
నిన్నటి రోజున వెంగళరావు నగర్ వేర్ హౌసింగ్ గోడౌన్స్ వద్ద గొంతు కోసిన చిన్నారి స్వగృహానికి వెళ్లి పరామర్శించిన సుబ్బానాయుడు
వారి కుటుంబ సభ్యులకు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు.
గంజాయి తాగిన మత్తులో బ్లేడుతో గొంతుపై గాయపరిచిన ఖాదర్ బాషాను విడిచి పెట్టే ప్రసక్తే లేదని, అక్కడి నుంచే పోలీసు వారితో ఫోన్లో మాట్లాడి కఠినంగా శిక్ష పడేలా చేయాలని కోరారు.
ఈమేరకు ఎక్సైజ్ శాఖను ముట్టడిస్తారనే అనుమానంతో కావలి టిడిపి కార్యాలయానికి ఈరోజు ఉదయాన్నే చేరుకున్న పోలీసులు.
ప్రజల సమస్యలపై అడిగే హక్కు లేదా అంటూ నిలదీసిన మాలేపాటి
Post a Comment