ఏస్ ఏస్ ఎల్ వి - డి 2 రాకెట్ ప్రయోగం విజయవంతం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి శుక్రవారం ఉదయం 9 : 18 గంటలకు
ప్రయోగించిన ఎస్ ఎస్ ఎల్ వి - డి 2 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది,
ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను భూమికి దగ్గర కక్ష లోకి
నిలపడం జరిగింది, ఇ ఒ ఎస్ -07 ఉపగ్రహం తో పాటు అమెరికాకు చెందిన జానుస్
ఉపగ్రహాన్ని వాణిజ్య ఒప్పందాలతో ప్రయోగించింది అలాగే దేశ వ్యాప్తముగా ఉన్న
750 మంది విద్యార్థినులు కలిసి రూపకల్పన చేసిన ఆజాది శాట్ ఉపగ్రహాన్ని కూడా
ఇస్రో విజయవంతంగా ప్రయోగించండం జరిగింది,ఈ ఏడాది ఇది మొదటి రాకెట్
ప్రయోగ విజయం కావడం తో ఇస్రో వర్గాల్లో ఆనందోత్సలు నెలకొన్నాయి, ఇ ఒ ఎస్ ఉపగ్రహం
ద్వారా భూమి పైన ,సముద్రాలలో వచ్చే వాతావరణ మార్పులను గుర్తిస్తారు,
బహుళ ప్రయోజనాలకు ఈ ఉపగ్రహం ఉపకరిస్తుంది.
ఈ సందర్భముగా ఇస్రో
చైర్మన్ సోమనాధ్ మాట్లాడుతూ భారత్ రాకెట్ ప్రయోగాలలో ఇప్పుడు సరికొత్త
రాకెట్ చేరిందని, ASLV ఏ ఏ ఎస్ ఎల్ వి, ఏస్ ఎల్ వి, పి ఎస్ ఎల్ వి, జిఎస్ఎల్వి , జీఎస్ ఎల్ వి మార్క్ - 3, తరువాత వాటి
వరుసలో ఆరవ రాకెట్ గా ఎస్ ఎస్ ఎల్ వి చేరిందని ,భూమికి 450 కి మీ దూరం లోని వృత్తాకారపు
కక్షలోకి ఉపగ్రహాలు చేరుకున్నట్లు ఆయన ప్రకటించారు, ఈ రాకెట్ లో సరికొత్త
వెహికల్ నేవిగేషన్ సిస్టం ను కూడా విజయవంతంగా ఉపయోగించడం జరిగిందని అన్నారు.
Post a Comment