వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి*

*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి*

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సత్యవేడు:-
 
తిరుపతి పార్లమెంట్ పరిధి సత్యవేడు నియోజకవర్గం సమీక్షా సమావేశం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం, సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడు దయసాగర్ రెడ్డి పాల్గొన్నారు.

స్థానిక శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ గత ఎన్నికలలో జగన్మోహనరెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను ప్రతి ఒక్కరూ ఆదరించి నా విజయానికి కృషి చేసారని రాబోయే ఎన్నికలలో కూడా ఆదరించాలని విన్నవించారు. చిన్న చిన్న సమస్యలు కాని మనస్పర్థలు ఉన్నా మనసులో పెట్టుకోకుండా సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ఎన్నికలలో కంటే  అత్యధిక మెజార్టీ సాధించే విధంగా అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఇప్పుడు అందుతున్న  సంక్షేమ ఫలాలు ఇలాగే అందాలంటే జగన్మోహనరెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి  రామ్  కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సత్యవేడు పరిశీలకుడుగా ఉన్న నేను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఇక్కడికి రావడం జరిగిందని పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు వస్తుందని అందుకు నేనే నిదర్శనమని ఆయన అన్నారు. అధ్యక్షుడి హోదాలో తిరుపతి జిల్లా నుండి మొత్తం స్థానాలు మంచి మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని అందుకు మీ అందరూ సహకారం అందించాలని కోరారు.

తదుపరి రీజినల్ కో ఆర్డినేటర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రీజినల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించాక మొట్ట మొదటి సమీక్షా సమావేశం సత్యవేడులోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని ఆ ప్రభావం గడప గడపకి వెళ్తున్నపుడు లబ్దిదారుల స్పందన ద్వారా తెలుస్తుందని అందువలన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ప్రతిష్టత్మకంగా చేయాలనీ కోరారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపినిచ్చారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget