* శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం లో మొదటి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ప్రారంభం*
* ఏడాది పూర్తి చేసుకొని రెండో ఏడాది దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం ప్రారంభం*
* అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం ప్రారంభించిన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి*
* నూతన సంవత్సరం మొదటి శుక్రవారం దాత జమ్మి ప్రసాద్*
* స్వర్గీయ జమ్మి శ్యామలమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం*
* దాత జమ్మి ప్రసాద్ ను సన్మానించిన జగన్మోహన్ రెడ్డి*
* దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి:జగన్మోహన్ రెడ్డి*
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, కోట:-
గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం ప్రాంగణంలో ప్రతీ శుక్రవారం శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం మరియు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల దాతృత్వంలో 2021 డిసెంబర్ 24 వ తేదీన అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఆనాటి నుండి దాతల దాతృత్వంలో క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వేలాదిమంది భక్తులు ఆకలి తీర్చితున్నారు ఆలయ చైర్మన్ .
*అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా సంవత్సరం పూర్తి చేసుకోవడంతో 2022 డిసంబర్ 23 న శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు,ముగ్గుల పోటీలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.2023 నూతన సంవత్సరం లో* *జనవరి మొదటి శుక్రవారం నాడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.*
*ఈ వారం దాతగా కోట గ్రామానికిచెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు జమ్మి ప్రసాద్ ఆయన ధర్మపత్ని స్వర్గీయ జమ్మి శ్యామలమ్మ ద్వితీయ వర్ధంతిసందర్భంగా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యమాన్ని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగాప్రారంభించారు.అనంతరం దాత జమ్మి ప్రసాద్ ను జగన్మోహన్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.*
*ఈ సందర్భంగా అల్లం రమణయ్య మాట్లాడుతూ 2021 లో రిటైర్డ్ ఉపాధ్యాయులు అవుల సుబ్బయ్య అమ్మవారికి గుడి గంట కానుకగా ఇవ్వడంతో ఆనాడు 100 మందికి భోజనాలు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆలయ ధర్మకర్త నల్లప రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణమద్దతుతో దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుందిఅనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో నిరంతరం కొనసాగుతుంది అని తెలిపారు.*
*స్వర్గీయ జమ్మి శ్యామలమ్మ తనకు సోదరి అనీ ఆమె రెండో వర్ధంతిసందర్భంగా ఆమె జ్ఞాపకార్ధంతో భర్త జమ్మి ప్రసాద్ మంచి భోజనాలు అందించారు.ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.అనంతరం దాత జమ్మి ప్రసాద్ ను ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఘనంగా సత్కరించారు.*
*ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మ కర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితిఅధ్యక్షుడు అల్లం రమణయ్య, సభ్యులు అవుల సుబ్బయ్య,పన్నగం సాయి, సుధాకర్ స్వామి, ఉద్దండి ధనుంజయ్య ఆచారి,బాబు రావు,టిటిడి నేతదువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, రిటైర్డ్ హౌసింగ్ డి ఈ నిరంజన్ రెడ్డి, నెల్లూరు కు చెందిన సురేష్,పి పి ఎఫ్ ఛైర్మన్ మీజూరు మల్లికార్జున రావు, సుబ్రహ్మణ్యం, అద్దాల శివ కుమార్, ఆలయ సిబ్బంది కావలి ప్రకాష్, కుమార్ ,సాయి, వెంకట కృష్ణయ్య, కారిమేటి నాగేశ్వర రావు తదితరులుపాల్గొన్నారు.*
Post a Comment