*మైనర్ బాలిక మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలో చేధించిన బుచ్చి పోలీసులు*
పెళ్లి నిశ్చయించారని ఇంట్లో నుండి పారిపోయిన 16 సంవత్సరాల మైనర్ బాలిక.
బుచ్చి పరిధిలోని కట్టుబడిపాలెంకు చెందిన బాలిక పదవతరగతి చదువుతున్నట్లు వెల్లడి.
బాలిక తల్లి పెళ్లి చేయాలని నిశ్చయించడంతో సోమవారం ఉదయం స్కూల్ కు వెళ్తున్నానని వెళ్లడం, స్కూల్ కు రాలేదని తల్లికి తెలపడంతో బుచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు.
వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, సాంకేతికత ఆధారంగా బాలిక మొబైల్ రైల్వే స్టేషన్ పరిధిలో స్విచ్ ఆఫ్ చేయడంతో CC కెమెరాలు పరిశీలన.
రైల్వే పోలీసుల సహకారంతో బాలిక విజయవాడ వైపు వెళ్తున్నట్లు భావించి, శోధించగా సింగరాయకొండ వద్ద రైలులో బాలికను గుర్తించి పోలీసులు..
క్షేమంగా తీసుకు వచ్చి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, మైనర్ బాలికలకు పెళ్లి చేయడం చట్టరీత్యానేరమని సూచించి, మైనర్ బాలికను అప్పగించిన బుచ్చి పోలీసులు..
సంతోషంతో కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు, బంధువులు, ప్రజలు.
Post a Comment