నూతన సంవత్సరం సందర్భంగా చెంగాలమ్మ ఆలయంలో అంబరాన్ని అంటిన సంబరాలు.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పట్టణం లో కాలంగి నది ఒడ్డున వెలసియున్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దక్షిణం ముఖ ఖాళీ శ్రీశ్రీశ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో
నూతన సంవత్సర సందర్భంగా అమ్మవారికి సంబరాలు అంగరంగ వైభవముగా ప్రారంభించారు.
ఆలయమంతా రంగు రంగుల పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకరించి
ఆలయమంతా రంగవల్లులతో నింపి, విద్యుత్ వెలుగుల మధ్య ఆలయాన్ని
దేదీప్యమానంగా నిలిపారు,తెల్లవారు జామున అమ్మణ్ణికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు
చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి , ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ
శ్రీనివాసులు రెడ్డి అమ్మణ్ణిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం
ఆలయం లో ఏర్పాటు చేసిన జ్యోతిని వెలిగించారు. ఆలయ
చైర్మన్ తో పాటు మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి దంపతులకు ,కళత్తూరు
రామ్మోహన్ రెడ్డి కి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి చేతులు మీదుగా ఆలయ గౌరవాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఆలయం లో
ఏర్పాటు చేసిన కోలాట భజనలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు, దొరవారి సత్రం ఎస్సై తిరుమలరావు ఆధ్వర్యంలో ముందస్తుగా తగు చర్యలు చేపట్టారు. ఈ వేడుకల్లో ఆలయ
ట్రస్ట్ సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి,వంకా దినేష్ ,మన్నెముద్దు పద్మజ,బండి
Post a Comment