పారిశుద్ధ్య కార్మికులకు రైన్ కోట్స్ అందజేసిన ఎమ్మెల్యే సంజీవయ్య...

 




 పారిశుద్ధ్య కార్మికులకు రైన్ కోట్స్ అందజేసిన ఎమ్మెల్యే సంజీవయ్య...

మీకు కావాల్సిన వసతులు మేం రప్పిస్తాం ప్రజలు కావలసిన వసతులు మీరు రప్పించాలి ఎమ్మెల్యే సంజీవయ్య..

  రవి కిరణాలు న్యూస్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నవంబర్ 14:-

 సూళ్లూరుపేట పట్టణ, మన్నారుపోలూరు పరిధిలో ఉన్న  Tarakeswara textiles pvt.Ltd కంపెనీ వారు సూళ్లూరుపేట మున్సిపల్ పారిశుధ్యకార్మికులకూ ఉచితంగా రైన్ కోట్స్ నూ అందజేశారు.*
ఈ కార్యక్రమనికి TTD బోర్డు పాలకమండలి సభ్యులు,సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు ముఖ్యఅతిధిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమత్ రెడ్డి గారు అధ్యక్షతన వహించారు.
అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు, సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి గారు, కార్మికులకూ రైన్ కోట్స్ అందించారు.

ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ

సూళ్లూరుపేట పట్టణ ప్రజలు ఆరోగ్యం, మీ చేతులో ఉంది, మీరు పరిశుభ్రతమైన వాతావరణాన్ని మీరు కల్పిస్తే పట్టణ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటు దోమల బెడద కూడ అరికట్టాలి అంటే మీరు పట్టణాన్ని పరిశుభ్రతంగా తీసుకునీ బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే సంజీవయ్య వారికి తెలియజేశారు.

ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చెత్త నిలువ ఉన్న ప్రాంతంలో దోమలు ఎక్కువగా తయారవుతుంది. తొందరాగా మురుగు చెత్త, వాసనా విటన్నిటిని మనం చూడకూడదు అనుకుంటే మీరు చక్కగా పనిచేయాలి. మీకు నెలవారీగా పి పి కిడ్స్,గాని సోప్స్ గాని, మున్సిపాలిటీ వారు అందిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల గా మీరు పని చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న,మీకు ఏమైనా వసతులు లాంటివి ఏమైనా కావాల్సి ఉంటే నా దృష్టికి తీసుకురావలసిందిగా ఎమ్మెల్యే సంజీవయ్య గారు వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు TTD బోర్డు పాలకమండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య,సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు  చైర్మన్ దువ్వురు బాలచంద్ర రెడ్డి, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు కళత్తూరు శేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ డైరెక్టర్ తుపాకుల ప్రసాద్,మున్సిపల్ co ఆప్షన్ సభ్యులు బాబు రావు, ఫయాజ్, మున్సిపల్ కౌన్సిలర్ మింజూరు రామకృష్ణ రెడ్డి, మునిప్రసాద్,బందిలి మహేష్,జనార్దన్,గుణపాటి మునస్వామి,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పాలమురళి, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget