చెరువును తలపిస్తున్న పాఠశాల.......
వర్షపు నీరు పాఠశాల నుండి బయటకు వెళ్లే విధంగా చూడండి సార్.....
రవి కిరణాలు న్యూస్,
తిరుపతి జిల్లా .దొరవారిసత్రం మండలం........
పాఠశాలలకు రావాలంటే పలు ఇబ్బందులు పడుతున్నారు అంటున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థు లు తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో అయినటువంటి పూల తోట లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో చెరువును తలపిస్తూ ఉంది. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే పలు ఇబ్బందులు పడుతూ వర్షపు నీటిలో అడుసు బుడద తొక్కుకుంటూ పాఠశాల గదిలోకి తొక్కుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఈ తంతు దొరవారిసత్రం మండల పరిధిలోని పూల తోట గ్రామ పరిధిలో జిల్లా ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంటుంది. వివరాల మేరకు మూడు రోజులకు కురుస్తున్న వర్షానికి ఆవరణం మొత్తం వర్షపు నీరు నుండి చెరువు లాగా ఉన్నా కూడా ఆ వర్షపు నీటి పాఠశాల ఆవరణము బయటికి పంపించే ప్రయత్నాలు పాఠశాల ఉపాధ్యాయులు గాని మరియు అధికారులు గానీ చేపట్టడం లేదు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపాలంటే వర్షపు నీటిలో కలిసి ఆరోగ్య నిత్య ఇబ్బందులకు గురవుతారు అన్న ఉద్దేశంతో పాఠశాలకు పంపే దాఖలు కనబడడం లేదు. అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా ఆ పాఠశాలలో వర్షపు నీటిని తొలగించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఉంటే అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని తల్లిదండ్రులు తెలిపారు.
Post a Comment