జర్నలిస్ట్ ల రైల్వే పాస్ ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

జర్నలిస్ట్ ల రైల్వే పాస్ ల సమస్యను కేంద్రం దృష్టికి  తీసుకెళ్తా
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, నవంబర్ 10:-
జర్నలిస్ట్ ల రైల్వే కన్సెషన్ పాస్ లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని  మోతిగల్లీ, ఖిలవాత్ లో ఉన్న ఉర్దు ముస్కాన్ సాలర్ -ఏ-మెమోరియల్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం 4 గంటలకు  ఎన్ యు జె(ఇండియా)అనుబంధం అయిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఏ) 4వ బేనియల్ కాన్ఫరెన్స్ కు హర్యానా గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై , జ్యోతి ప్రజ్వలన చేసి కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కు అక్రిడేషన్ కమిటీల్లో, అటాక్స్ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వక పోవడం పై స్పందించిన ఆయన, ఈ విషయం తో పాటు జర్నలిస్ట్ సమస్యలు తనకు వివరంగా అందిస్తే వాటిని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్నారు. కరోన సమయంలో జర్నలిస్టు లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వృత్తి ధర్మాన్ని నిర్వహించారని అభినందించారు. జర్నలిజం వృత్తి సమాజం లో ఎంతో కీలక మైందని, జర్నలిస్ట్ అనే వారు, నీతి నిజాయితీగా పనిచేస్తే సమాజంలోని కుళ్లును కడిగేయొచ్చు అన్నారు. సమాజంలో ని నాలుగు స్థంబాల్లో ఒకటైన జర్నలిస్ట్ లకు తను ఎప్పుడు సహాయకారిగా ఉంటాను అన్నారు. ప్రభుత్వాలు చేసే తప్పిదాలను బయట పెట్టె దమ్ము ఒక జర్నలిస్ట్ కు ఉందన్నారు. టీజేఏ సంఘం అభివృద్ధికి తన తోడ్పాటు ఎప్పుడు ఉంటుందన్నారు. అనంతరం ఎన్ యు జె(ఐ) జాతీయ అధ్యడు రాస్ బిహారి మాట్లాడుతూ, జర్నలిజం అభివృద్ధికి ప్రతి పాత్రికేయుడు నిబద్ధతతో పనిచేయాలని, తప్పుడు జర్నలిజాన్ని అంత మొందించాలని, తప్పుడు వార్తలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. నిజమైన జర్నలిజంతో సమాజ హితం ఉంటుందన్నారు. జర్నలిస్ట్ సంక్షేమం కోసం టీజేఏ పని చేస్తుందని, టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జర్నలిస్టులకు ఎప్పుడు తాము సలహదారులుగా, అండగా ఉంటామన్నారు. టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారావు మాట్లాడుతూ, తనపై పెట్టిన అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు. జర్నలిస్ట్ ల సమస్యల పై ఎప్పటికప్పుడు పోరాడుతూ, సమస్యల సాధనలో ముందుంటాను అన్నారు. టీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల రైల్వే పాస్ ల విషయం కేంద్రంతో మాట్లాడి త్వరితంగా పునరుద్ధరించేలా చూడాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ను కోరడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్రిడిటేషన్ కమిటీలో టీజేఏ కు సభ్యత్వం ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వంతో సమస్య పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ సదస్సులో  ఎన్ యూ జె (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రదీప్ తివారి, సమన్వయ కర్త ఇంద్రాణీ,  టిజెఏ ఉపాధ్యక్షులు ఖాసీం,  నీలకంఠం, ఆర్గనైజింగ్  సెక్రటరీ రాజలింగం, మాజీ ఉపాధ్యక్షులు మోహన్ యాదవ్,  కార్యదర్శి డేవిడ్ జేమ్స్, కోశాధికారి ఖలీల్ హమ్మద్, టిజెఏ ప్రతినిధులు మాజీద్,  గౌరీ,  డాక్టర్ షేక్ హసీనా, రియాజ్, ప్రశాంత్ గౌడ్, అరిఫ్, సిద్దిఖీ, వలి హమ్మద్,  నసీర్, షైక్ మహమ్మద్, వదూద్, హాబీబ్, అసద్, అనిల్ నాయక్, సాయిరాంగౌడ్, గౌరవ అతిథులుగా 
బీజేపీ భాగ్యనగర్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, గోల్కొండ బీజేపీ అధ్యక్షుడు పాండు యాదవ్, లిఖిత ఫెసిలిటీ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ఎండి.బి.ధర్మారావు తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జర్నలిస్టులు హాజరయ్యారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget