కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు త్వరలోనే మారబోతున్నాయని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలై ప్రస్తుతం మహారాష్ట్రకు చేరిందన్నారు. ఛిన్నాభిన్నమవుతున్న దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏకం చేస్తోందన్నారు. దేశంలో నోట్ల రద్దువల్లే ఆర్థిక కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి వారికి ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయని, ఎన్నికల యుద్ధం కాంగ్రెస్, టీడీపీ మధ్యే జరుగుతుందని స్పష్టం చేశారు.
Post a Comment