వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత చూసి మతి చలించింది..



 

 వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత చూసి మతి చలించింది. సాక్షాత్తు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన అమరావతిపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అమరావతిలో రాజధాని కడతామంటే రైతులు భూములిచ్చారు. అమరావతికి అధికార, ప్రతిపక్షలుండే నిండు సభలో ఒప్పుకుంటేనే రైతులు భూములివ్వడానికి అంగీకరించారు అమరావతిలో రాజధాని కడతామని చెప్పి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లలో గెలిచింది ధర్మాన రాజీనామా కాదు..  కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి.విశాఖలో సగానికి పైగా పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయి. దమ్ముంటే 30  మందికి పైగా  ఉన్న లోక్ సభ,  రాజ్యసభ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖలో రైల్వే జోన్ తీసుకురండి. మూడు రాజదానుల సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు చూసుకొని మాట్లాడాలి. రైతుల పాదయాత్ర పై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి. రాజధాని కుప్పంలోనో, నారావారిపల్లిలోనో పెట్టుకుంటే ఏడవండి. రాష్ట్ర నడిబొడ్డులో నిర్మిస్తున్న రాజధానిపై మీకున్న కష్టమేంటో చెప్పాలి. అమరావతికి అభివృద్ధికి సంబంధం లేదు..అమెరికాలోని పరిస్థితులే అందుకు నిదర్శనం చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన 10 కేంద్ర సంస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖలో భూకుంభకోణంలో 40 వేల కోట్లు అవినీతి జరిగింది.ఈ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలు అన్నట్టుంది. మంత్రులు రాజీనామా చేసి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోండి. రోజమ్మతో మాట్లాడుకుని జబర్దస్త్ లో మూడు రాజధానుల స్కిట్ వేసుకోండి

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget