అంగరంగ వైభవంగా సూళ్లూరు, నాగరాజ పురం నుండి అమ్మణ్ణికి సారె..

అంగరంగ వైభవంగా సూళ్లూరు, నాగరాజ పురం నుండి అమ్మణ్ణికి సారె.. 

తిరుపతి జిల్లా,సూళ్లూరుపేట:-

 కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తుల కొంగు బంగారం, దక్షిణ ముఖ కాళీ, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా
శరన్నవరాత్రి వేడుకలలో అమ్మణికి  6 వ రోజు సాయంత్రం సూళ్లూరు,నాగరాజపురం, వాటంబేడు రోడ్డు  ప్రాంతాల నుండి అమ్మణ్ణికి సారె ను తీసుకొచ్చారు. ముందుగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి, ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించారు.వారికి  మోహన్ రాజా రెడ్డి, ఈదూరు. మునాస్వామి, గ్రామ పెద్దలు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు అనంతరం ఛైర్మన్, ఈఓ  కాలి నడకన మహిళలతో కలిసి  వారు తెచ్చిన సారెను మహిళలు తలపై పెట్టుకుని మేళతాళాలతో , కేరళ డప్పువాయిద్యాలతో,వీరజాటీలతో ఊరేగింపుగా బయలుదేరి  
ఆలయం వద్దకు  చేరుకున్నారు. ముందుగా అమ్మణ్ణి చెట్టువద్దకు చేరుకుని పూజలు చేసి అనంతరం ఆలయంలోని అమ్మణ్ణి సన్నిధిలోకి చేరుకొని మహిళలంతా అమ్మణ్ణి కి సారెను స్వయంగా సమర్పించారు.
 ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట  మునిసిపల్ ఛైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కౌన్సిలర్ లు కడూరు లక్ష్మమ్మ, ఈదూరు చెంగమ్మ మరియు ఆలయ పాలక మండలి సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్ , వైయస్ఆర్ సీపీ నాయకలు కళ్ళత్తూరు జనార్థన్ రెడ్డి, ఈదూరు మునస్వామి, చెంగయ్య, రామదాసు,పొన్న చిన్నెయ్య, ఆలయ సిబ్బంది  తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget