శ్రీసిటీలో సందర్శించిన జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యుల బృందం
రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ, అక్టోబర్ 9, 2022:
చెన్నైలోని జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యుల బృందం ఆదివారం శ్రీసిటీని సందర్శించారు. ఆ సంస్థ అధ్యక్షులు పి. రవీంద్రకుమార్రెడ్డి ఆధ్వర్యంలో విచ్చేసిన బృందంలో 20 సభ్యులు ఉన్నారు. శ్రీసిటీ యం.డీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి శ్రీసిటీ ప్రగతిని వివరించారు.
'మేక్ ఇన్ ఇండియా' లో మేటిగా, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగంలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న శ్రీసిటీ, ఉపాధి కల్పన ద్వారా పరిసర ప్రాంతాల ప్రజల సామాజిక ఆర్ధికాభివృద్ధి, మహిళా సాధికారత, విద్య, వైద్య మౌళిక వసతుల ఎర్పాటు వంటి వివిధ అంశాలపై తీసుకుంటున్న చర్యలు , డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చేస్తున్న కృషి అమోఘమని రవీంద్రకుమార్రెడ్డి ప్రస్తుతించారు. జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్టుతో రవీంద్ర సన్నారెడ్డికి అనుబంధం ఉండడం తమకెంతో సంతోషంగా ఉందని చెబుతూ, తమ సంస్థ సభ్యుల పర్యటనకు అనుమతించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత, వారందరూ సామూహిక లక్ష్మీ సహస్రనామ మరియూ విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. శ్రీసిటీ మరింత ప్రగతి సాధించి పురోగమించాలని భగవంతుని ప్రార్ధించారు. ట్రస్ట్ తరఫున డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తండ్రి రాజగోపల రెడ్డిని రవీంద్రకుమార్రెడ్డి సత్కరించి, శ్రీ శ్రీ శ్రీ చిన జియర్ స్వామి వారి మంగళా శాసనాలను ఆయనకు అందించారు.
వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే పెరటాసి మాసంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యుల బృందం శ్రీసిటీకి రావటం, సామూహిక లక్ష్మీ సహస్రనామ మరియూ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చాలా అనందంగా ఉన్నదని డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. రవీంద్రకుమార్రెడ్డికి ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీసిటీలోని వివిధ ప్రాంతాలను సందర్శించిన పిదప నర్సరిలో ప్రతిష్టించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారిని దర్శంచి పూజలు చేశారు.
Post a Comment