శ్రీకాకుళం జిల్లా, సగడం మండలం, బాతువ గ్రామంలో అనాగరిక చర్య. ఆ గ్రామ సర్పంచ్ ఆదినారాయణ బాతువ గ్రామానికి చెందిన 40 రజక కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా చాకలి అంటూ అవహేళన చేసి దాడి చేశారని ఈరోజు కోటాలో ఆయన మీడియాలో మాట్లాడుతూ ఆదినారాయణ కను సన్నలలో గ్రామ ప్రజలు వేధిస్తున్నారని ఇటీవల దాడి కూడా చేశారని ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఇరువర్గాలను రాజీ కుదిర్చి ఎటువంటి గొడవలు లేకుండా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పగా మళ్లీ ఆదివారం నుంచి తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసినట్టు దండోరా వేయించి తమను అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నాగరిక ప్రపంచంలో ఈనాటికి కూడా ఈ విధంగా గ్రామ పెద్దలు ప్రవర్తించడం దేనికి సందేశమని ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు బట్టలను ఏ విధంగా అయితే బండకేసి బాదుతారో అదేవిధంగా తమ కులస్తులు జోలికి వస్తే బట్టలను బాదినట్లు బాదుతామని హెచ్చరించారు...
ఈ కార్యక్రమంలో రజక నాయకులు కనుపూరు సుధాకర్ ,గుత్తికొండ రవికుమార్ ,పల్లమాల మణి , తదితరులు పాల్గొన్నారు
Post a Comment