తిరుపతి
సెప్టెంబర్ 16:
జిల్లా గ్రామీణాబివృద్ది సంస్థ ఏర్పాటు చేసిన గ్రామీణ పేదరిక తగ్గింపు ప్రణాళిక (VPRP) సమావేశానికి జిల్లా స్థాయి లైన్ డెపార్ట్మెంట్ హెచ్‌ఓడి లతో సమావేశం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించడమైనది. ఈ సమావేశములో
1. ఎంటైటిల్మెంట్ ప్లాన్.
2. లైవిలి హుడ్ ప్లాన్
3.పబ్లిక్ గూడ్స్ మరియు రిసోర్స్ ప్లాన్
4. సోషల్ డెవలప్మెంట్ ప్లాన్
మొదలగు ప్లాన్స్ ఏ విధముగా అదికారులు మరియు స్వయం సహాయక సంఘ మహిళలతో తయారు చేయాలి అనే విధానాన్ని వివరించండం జరిగింది.
కలెక్టర్ గారు మాట్లాడుతూ అన్నీ శాఖల అదికారుల ను ఉద్దేశించి ప్రతి డిపార్ట్మెంట్ గ్రామ స్థాయి అబివృద్ధి ప్రణాళికలో బాగస్వామ్యం కావాలని ఆదేశించారు. అటవీశాక , పశుసంవర్ధక శాక, ICDS మరియు ఇతర అదికారులని డిపార్ట్మెంట్ వారీగా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న పథకాలను తప్పనిసరిగా GPDP ప్లాన్ లో పొందుపరచి గ్రామ స్థాయిలో పేదలకు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ ప్రణాళికలు తయారు చేసిన తరువాత వీటిని గ్రామ సభ ఆమోదంతో గ్రామ పంచాయతీ అబివృద్ది ప్రణాళిక (GPDP) లో పొందుపరచి e-గ్రామ్ స్వరాజ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయవలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. పి.డి. గారు, జిల్లా పంచాయతీ అధికారి మరియు ఇతర జిల్లా స్థాయి అదికారులు పాల్గొనడం జరిగింది.
Post a Comment