SPS నెల్లూరు జిల్లా
“రోడ్డు భద్రతా – ప్రమాదాల నియంత్రణ” పై ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్వహించిన VC లో పాల్గొన్న జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
చిలకలూరు పేట నుండి నెల్లూరు వరకు హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణపై నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, యస్.పి.లు, హైవే అధారిటీ, పలు విభాగాలు, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారితో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. రోడ్డు ప్రమాదాల నివారణకు సంయుక్తంగా వ్యూహరచనలు.. మరణాల రేటు తగ్గించుటే ప్రధాన ధ్యేయం.-CS గారు మూడు జిల్లాల అధికారుల నుండి సలహాలు స్వీకరణ.. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారు ముందస్తు జాగ్రత్తలపై PPT ద్వారా విశదీకరణ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, పెట్రోలింగ్ వ్యవస్థ, LHMS, స్పీడ్ లెన్స్ గన్స్, బ్రీత్ ఎనలైజర్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రాముఖ్యత, ఇతర ప్రణాళికలను వివరించిన జిల్లా యస్.పి. గారు.. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఎక్కువగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుట, రాంగ్ పార్కింగ్, గేదెలు అడ్డు రావడమే ప్రమాదాలకు ముఖ్య కారణాలు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హైవే పై 12 స్టేషన్ ల పరిధిలో 18 బ్లాక్ స్పాట్ లను గుర్తించడం జరిగింది. తదనుగుణంగా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. 38 వల్నరబుల్ లోకేషన్స్ గుర్తించామని, రేడియం జాకెట్స్, డ్రమ్స్ ఏర్పాటు చేసామని, ప్రతి నెల అన్ని విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, చైతన్య కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ పరికరాల సేకరణ వాటి ఉపయోగం, తదితర అంశాలను వివరించారు. అన్ని సౌకర్యాలతో కనీసం 15 నిముషాలలో అంబులెన్స్ సేవలు మరింత చేరువయ్యేలా చూడాలని తెలిపారు.
Post a Comment