చెంగాళ్ళమ్మ తల్లిని దర్శించుకున్న జిల్లా సంయుక్త కలెక్టరు, శ్రీ డి.కె.బాలాజి I.A.S., కుటుంబ సభ్యులు.
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట:-
తెలుగు, తమిళ ఆరాధ్యదైవం భక్తుల కొంగు బంగారం దక్షిణ ముఖ కాళీ మాత అయిన శ్రీ శ్రీ శ్రీ చెంగాళమ్మ తల్లిని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ డి కె బాలాజీ IAS కుటుభ సమేతముగా అమ్మవారిని దర్శించుకొన్నారు. వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికి వేదపండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమములో సూళ్ళూరుపేట తహసీల్దార్, కె.రవికుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఓలేటి బాలసత్యనారాయణ పాల్గొన్నారు.
Post a Comment