కావలి మున్సిపాలిటీ పరిధిలోనీ మద్దూరుపాడు నందు బిజెపి ఆధ్వర్యంలో ప్రజా పోరు






 

 కావలి మున్సిపాలిటీ పరిధిలోనీ మద్దూరుపాడు నందు బిజెపి ఆధ్వర్యంలో ప్రజా పోరు:: బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం.

భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన, బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశానుసారం, కావలి మున్సిపాలిటీ పరిధిలోని మద్దురుపాడులో పలు సెంటర్లలో ఈరోజు ప్రజాపోరు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

బీజేవైఎం కావలి పట్టణ అధ్యక్షులు ఆళ్ల తిరుపతిరావు ఆధ్వర్యంలో మద్దురుపాడు లోని పలు సెంటర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది



ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ కావలి మున్సిపల్ పరిధిలోని మద్దూరుపాడు సమస్యల వలయంలో చిక్కుకుంది అన్నారు. గతంలో గ్రామం గా ఉన్న మద్దురూపాడు మున్సిపాలిటీలో  విలీనమైనప్పటినుండి అనేక సమస్యలతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ,డ్రైనేజ్ వ్యవస్థ ,పారిశుద్ధ్య వ్యవస్థ , మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు.  కావలి మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే మద్దూరుపాడు ఒకటో వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి, ఇక్కడ వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభం వలన తీవ్రంగా నష్టపోయిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు 2020 ఏప్రిల్ నెల నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం అందిస్తుంది .ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 తో ముగుస్తున్న పథకాన్ని డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచిత బియ్యాన్ని డిసెంబర్ వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కావలి మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా ఉంది ,నీటి నిర్వహణ మరియు పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉందని తెలిపారు. తడి చెత్త పొడి చెత్త పేరుతో అధిక పన్నులు వసూలు  చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కావలి ప్రాంతంలో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. అమృత పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా వైసిపి ప్రభుత్వం లో దుర్వినియోగం అయ్యాయని అన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదలకు అందవలసిన బియ్యం నాలుగు నెలలుగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నాలుగు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ముసునూరు రోడ్డు, తుమ్మలపెంట రోడ్డు, ఉదయగిరి బ్రిడ్జి రోడ్లు  అధికార పార్టీ నాయకులకు మరియు ప్రజా ప్రతినిధులకు, అధికారుల కంటికి కనపడవా అని ప్రశ్నించారు.వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కావలి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు లక్కరాజు భాస్కర్ ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుట్టుబోయిన మాధవరావు యాదవ్ ,కేతిరెడ్డి విష్ణు తేజ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శివప్రసాద్ బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కిల గుంట జీవ, కూరాకుల సవీంద్ర ,కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు  తూమాటి తిరుపతి స్వామి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు కామినేని ఉదయలక్ష్మి ,కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగమూరు వెంకటరెడ్డి ,ఎస్సీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు కటకం మనోజ్ కుమార్, మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి చేజర్ల స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget