శ్రద్ధ,సహనంతో విధులు నిర్వర్తించాలి

 



 తిరుపతి జిల్లా...

శ్రద్ధ,సహనంతో విధులు నిర్వర్తించాలి.

మనం సేవ చేయడానికి మాత్రమె వచ్చాము.

అనంతపూర్ రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ఐపీఎస్., జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,

రేపు శ్రీవారి గరుడ సేవ నేపద్యంలో వివిధ జిల్లా ల నుండి వచ్చిన పోలీస్ అధికారులతో అనంతపూర్ రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ఐపీఎస్., జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వారు బద్రత పై పోలీస్ కంట్రోల్ రూమ్ నందు సమీక్ష నిర్వహించారు.

 ఈ సమావేశంలో చిత్తూర్, అన్నమయ్య, బాపట్ల, పార్వతి పూరం ఎస్పి ల తో పాటు అడిషనల్ ఎస్పీ లు,డిఎస్పీ లు, సిఐలు పాల్గొన్నారు.

డీఐజీ గారు మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో శ్రీవారి బ్రహ్మోత్సవం జరుగుతున్నది రేపు శ్రీవారి గరుడ సేవ రోజున రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా, భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి బందోబస్తు ఏర్పాటు చేశాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,ఇతరత్ర సంఘ విద్రోహ శక్తులును కూడా ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టాం మాన్నరు

గరుడ సేవ అనునది శ్రీవారికి మిక్కిలి ఇష్టమైన ముఖ్యమైన సేవ కనుక దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారని అంచనా కాబట్టి ఐదంచెల భద్రత ను ఏర్పాట్లు చేశాము తిరుపతి అవుట్ కట్స్ లో తిరుమలకు వేళ్ళు వాహనాలకు పాసులు ఇవ్వడం ఇవ్వడంతో పాటు తొమ్మిది రూట్లలో హైవేల దగ్గర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాతే తిరుపతి లోకి అనుమతిస్తామని అన్నారు

తిరుపతి లోని కొన్ని పార్కింగ్ ప్రాంతాల్లో కూడా వాహనాలను తనిఖీ చేసి పాసులు జారీ చేసి కొండమీదికి అనుమతిస్తారు నాలుగు చక్రాల వాహనాలను మాత్రమే కొండకి అనుమతిస్తారు. ఇలా కొండ కి వచ్చిన వాహనంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశములలో వాహనములను పార్కు చేసి భక్తులు మాడవీధుల్లో కు చేరుకుంటారు మాడవీధుల్లో గ్యాలరీలో సుమారు రెండు లక్ష మంది కిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటది. మిగిలిన ఇన్నర్ లైన్ లోని భక్తులలందరికీ మంచి దర్శన భాగ్యం కలిగించడానికి  పోలీస్ వారు అన్నివిధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు అన్ని చర్యలు తీతీసుకున్నాము అని అన్నారు.

ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,గారు మాట్లాడుతు భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని వారి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని తిరుమల ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవర్తించాలి గరుడ సేవ కు అశేష భక్తజనం వస్తారు ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ, టీటీడీ వారు సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

భక్తులు చిన్నపిల్లలతో వచ్చు భక్తులు జాగ్రత్తగా ఉండాలని అలాగే విలువైన వస్తువులను వెంట తీసుకురావద్దని  వీలైనంతవరకు  జాగ్రత్తగా ఉండడం మంచిదన్నారు.

వృద్ధులు పిల్లలు తప్పిపోకుండా 14 జియో టాక్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ సిబ్బందిని ఉంచడం జరిగిందని తిరుమల వచ్చు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

నేరనియంత్రణ కొరకు ప్రత్యేక నిపుణులైన క్రైమ్ పోలీసుల బృందాలను ఏర్పాటు చేశామని ఈ బృందంలో ఇతర రాష్ట్ర సిబ్బంది కూడా ఉంటారని ఎలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు.

యావన్మంది అశేష భక్త జనం స్వామివారి సేవను చూసి తరించడానికి భక్తులందరూ పోలీసు వారు టీటీడీ వారు సూచించిన సూచనలను తప్పకుండా పాటించాలని అన్యస్తులు మాటలు నమ్మరాదని ఏ అవసరమైన ఏ సహాయమైనా పోలీసు మరియు టీటీడీ వారి సహాయం తీసుకోవాలని అలాగే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget