*జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్*
తిరుపతి, సెప్టెంబర్ 21: పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ కొరకు చేపట్టిన జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం తిరుపతి లోని బైరాగి పట్టెడ లోని ఎం.జి.ఎం పాఠశాలలోని విద్యార్థి, విద్యార్థినులకు డీవార్మింగ్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ మెరుగు పరిచి ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ మాత్రలను పిల్లలు భోజనం చేసిన తర్వాత మింగించాలని తెలిపారు. 1-2 సం పిల్లలకు సగం మాత్ర, 2-19 సం పిల్లలకు 400mg ఒక మాత్ర చప్పరిస్తూ మింగించాలని అన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పిల్లలు 97079, ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల విద్యార్థులు 293,211 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంటర్మీడియట్ విద్యార్థులు 55,924 మంది, బడి బయట పిల్లలు (10-19 సం) 4156 మంది మొత్తం వెరసి 4,50,370 పిల్లలు ఉన్నారని వాళ్ళందరికీ డీవార్మింగ్ మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు. పిల్లలలో రక్త హీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు నివారించేందుకు ప్రభుత్వం డివార్మింగ్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంను జిల్లాలోని అన్నీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారులు, మండల పరిధిలో మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా పర్యవేక్షించడం జరిగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కొరకు మన బడి , నాడు –నేడు, రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాలతో పాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ పై దృష్టి పెట్టీ వారికి కంటి పరీక్షలు ఆరోగ్య పరీక్షలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరారు.
Post a Comment