సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో సింగయ్య....
దొరవారిసత్రం తిరుపతి జిల్లా రవికిరణాలు టీవీ..... దొరవారిసత్రం మండల పరిధిలోనిపోలిరెడ్డిపాలెం సచివాలయాన్ని గురువారం ఎంపీడీవో సింగయ్య ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతిరోజూ సాయంత్రం 3 గం నుండి 5 గం.ల వరకు సచువాలయ సిబ్బంది సందర్శకులుకు తప్పనిసరిగా అందుబాటులోఉండాలనిసూచించడంజరిగింది.సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చక్కగా పని చేయడం వల సచివాలయం ఎపి సేవ సర్వీసులు అందించుటలో జిల్లాలోనే నాలుగవ స్థానంలో ఉండటాన్ని గుర్తించి అభినందించడం జరుగింది. సచివాలయంలో లభించే లామినేషన్ సేవలు, రైల్వే సేవలు, విద్యుత్ బిల్లులు చెల్లింపు తదితర సేవలు పై ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయం సిబ్బందికి తెలియజేయడం జరిగింది అనంతరం పోలిరెడ్డిపాలెం గ్రామ పరిధిలో ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు ఇంటింటా నుండి ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలని సూచించారు రైతు భరోసా కేంద్రాన్ని ఆరోగ్య కేంద్రాన్ని నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తెలిపారు జగనన్న గృహ నిర్మాణం పథకం క్రింద నిర్మిస్తున్న నూతన ఇళ్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో తెలిపారు పోలిరెడ్డిపాలెం గిరిజన కాలనీ సందర్శించి ఉపాధి హామీ పనులపై గిరిజన తో మాట్లాడటం జరిగింది ఈ కాలనీలో ఉపాధిహామీ పనులు వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలను ఎంపీడీవో అభినందించడం జరిగింది ప్రతి కుటుంబం ఉపాధి హామీ పనులు వందరోజులు పూర్తి చేయాలని తెలిపారు వీరితోపాటు సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు
Post a Comment