కాకాణి & బ్యాచ్ మైనింగ్ మాఫియా అక్రమాలు నిరూపించేందుకు సిద్ధం

 





 కాకాణి & బ్యాచ్ మైనింగ్ మాఫియా అక్రమాలు నిరూపించేందుకు సిద్ధం

నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి నియోజకవర్గ నేతలు గుమ్మడి రాజా యాదవ్, రావూరి రాధాకృష్ణమ నాయుడు, మావిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు  కోట్లకు కోట్లు దోచేస్తున్న మీ గ్రావెల్ దందాకు మీడియా సోదరులతో పాటు నియోజకవర్గ ప్రజలే ప్రత్యక్ష సాక్షులు  ప్రకాశం బ్యారేజీకి సర్వేపల్లికి గ్రావెల్ తోలుతున్నారా..మాఫియా దందాపై మీ కప్పదాటు వైఖరికి ఇదే నిదర్శనం

సర్వేపల్లిలో మీ మైనింగ్ మాఫియా ఆగడాలు దాచితే దాగేవి కావు

2014 నుంచి ఇప్పటి వరకు శాటిలైట్ చిత్రాలు తీసుకుందాం..ఎవరి హయాంలో గ్రావెల్ మైనింగ్ ఎంత జరిగిందో తేలిపోతుంది  సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ సంపదను కాకాణి & బ్యాచ్ కొల్లగొడుతోందని మేం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 40 నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం  తహసీల్దార్ నుంచి సీఎస్ వరకు ఎన్నోమార్లు ఫిర్యాదు చేశాం..లోకాయుక్తతో పాటు హైకోర్టులో కేసులు వేశాం  మైనింగ్ మాఫియా ఇచ్చే రోజువారి మామూళ్లకు అలవాటు పడిన కొందరు అధికారులు అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్నారు 

సర్వేపల్లి రిజర్వాయరు నుంచి కసుమూరు తిప్ప వరకు, రామదాసుకండ్రిగ బీసీల భూముల నుంచి ఈదగాలి దళితుల భూముల వరకు ఎక్కడా వదిలిపెట్టకుండా 30 అడుగుల మేర గోతులు పెట్టేశారు.. రిజర్వాయరులో జరిగిన అక్రమ మైనింగ్ పై ఇరిగేషన్ అధికారులు గత ఏడాది పెట్టిన కేసును నీరుగార్చిందెవరు  యూనివర్సిటీ భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వేస్తే ఎస్పీకి వీసీ, రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదును తొక్కేసిందెవరు  మీ అవినీతి, అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెడితే ఎత్తు, పొడుగు అని మాట్లాడుతారా...  మా నాయకుడు నాలుగడుగులు ఉంటే మీ నాయకుడు పది అడుగులు ఉన్నాడా

తెగబలిసిన మీ నాయకుడు కాకాణి ప్రజల సొత్తును పట్టపగలే దోచేస్తుంటే...సన్నగా ఉన్నప్పటికీ మా నాయకుడు సోమిరెడ్డి వాటి పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ గమనిన్తున్నారు.. మీరెన్ని అవాకులు, చెవాకులు పేలినా మీ అక్రమ మైనింగ్ దందాను ఉపేక్షించే ప్రసక్తే లేదు  ప్రజల మద్దతుతో న్యాయపోరాటం చేసి కాకాణి అండ్ బ్యాచ్ మైనింగ్ మాఫియా గుట్టును విప్పి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం ఖాయం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget