బి.పి.మండల్ విగ్రహ దిమ్మె కూల్చడమంటే బీసీ లను అవమానించడమే - టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర..
బీసీ రిజర్వేషన్ల పితామహుడు బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం అత్యంత దుర్మార్గం.
బీసీ లన్నా, బీసీ నేతలన్నా వైసీపీ ప్రభుత్వానికి చిన్న చూపు. బీసీల హక్కుల కోసం అనుక్షణం తపించిన బి.పి.మండల్ వంటి మహనీయుని విగ్రహ దిమ్మె కూల్చడం బీసీ లను అవమానించడమే.
బీసీ వర్గాలపై జరిగే దాడులను, మైనార్టీలు, దళితుల పై పోలీసులు చేస్తున్న అరాచకాలను ఎదురించి బడుగుల పక్షాన నిలిచిన నాయకుడు బి.పి.మండల్.
పౌర హక్కుల కమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వ, విద్య సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు బి.పి.మండల్ అండగా నిలిచారు.
బీసీ లకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు లభించినప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని బి.పి.మండల్ ఎలుగెత్తి చాటారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన బి.పి.మండల్ విగ్రహ దిమ్మెను కనీస ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం అవమానిస్తుంది..
Post a Comment