రవి కిరణాలు టీవీ వాకాడు ఏఎంసీ ఆవరణలో 'నేదురుమల్లి' వర్గంతో సమావేశమైన శ్యాంప్రసాద్ రెడ్డి
జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నా..
సీఎం జగన్మోహన్ రెడ్డికి ఋణపడి ఉంటా..
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు మండలిలో గళమెత్తుతా..!
మీ అందరి సహకారం, ఆత్మీయత మరువలేనిది.. గతంలో నమోదు చేసుకున్న ఓట్లు రద్దయ్యాయి.. నవంబర్ 7 లోపు దరఖాస్తు చేసుకోండి.. 2019 సం..మునుపు డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ , రిటైర్డ్ ఉద్యోగులు ఓటు నమోదు చేసుకోండి..!
'వాకాడు' లో శ్యాంప్రసాద్ రెడ్డికి భారీ మెజారిటీ ఖాయం: భక్తవత్సలరెడ్డి భరోసా..
'రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నా.. నా గెలుపుకు సహకరించండి.. శాసనమండలిలో నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతా.. వాకాడు మండలానికి పలు పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తా..' అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. వాకాడు ఏఎంసీ కార్యాలయ ఆవరణలో సోమవారం మండల పరిధిలోని నేదురుమల్లి వర్గం, వైసీపీ నాయకులు, కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల) పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్నానన్నారు. తన పేరును ఖరారు చేసినందుకు జగన్ ఋణపడి ఉంటానన్నారు. ప్రకాశం జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, రీజనల్ కో-ఆర్డినేటర్లను కలిసి తన గెలుపుకు సహకరించాల్సిందిగా కోరానన్నారు. నెల్లూరులో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల అధ్యక్షతన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలతో సమన్వయ సమావేశం జరిగిందన్నారు. అందరూ ఆత్మీయంగా ఆదరిస్తూ, గెలుపుకు సహకరిస్తామని హామీ ఇవ్వడం శుభ సూచకమన్నారు.
ఇలా పలువురు ప్రముఖులను కలుస్తూ గెలుపుకు సహకారం కోరుతున్నానని, ఈ క్రమంలో భాగంగా సోమవారం వాకాడు మండలానికి చెందిన సూళ్లూరుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి అధ్యక్షతన వైసీపీ ముఖ్యనాయకులతో కలిసానన్నారు. వాకాడు మండలంలో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేస్తానని భక్తవత్సలరెడ్డి మాట ఇవ్వడం సంతోషకరమన్నారు.
2019 సంవత్సరం అక్టోబర్ 1 నాటికి మూడు సంవత్సరాల డిగ్రీని పూర్తి చేసిన వారి కోసం, ఓటు నమోదు ప్రక్రియ అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు కొనసాగుతుందన్నారు. ఆయుర్వేదం డిగ్రీ, డాక్టర్లు, ఇంజినీర్లు, ఎలాంటి డిగ్రీ అర్హత ఉన్నా, రిటైర్డ్ ఉద్యోగులైనా ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులన్నారు. గతంలో ఉన్న ఓట్లు రద్దు చేసినందున, వారందరూ తప్పనిసరిగా ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఎమ్మెల్సీగా తన విజయానికి అందరూ సహకరించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను శాసన మండల దృష్టికి తీసుకెళ్లి నిరుద్యోగ పట్టబద్రులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు.
అనంతరం వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ.. వాకాడు మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. మండలంలోని వైసీపీ నాయకులందరూ సమిష్టిగా పని చేసి, శ్యాంప్రసాద్ రెడ్డికి భారీ మెజార్టీ వచ్చేందుకు పనిచేయాలన్నారు. గూడూరు నియోజకవర్గంలోనే వాకాడు మండలంలో వైసీపీకి భారీ మెజార్టీ ఖాయమని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో.. వాకాడు మాజీ ఎంపిపి దువ్వూరు మధుసూదన్ రెడ్డి, వాకాడు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, సన్నారెడ్డి చంద్రభూషణ్ రెడ్డి, దువ్వూరు విజయ భాస్కర్ రెడ్డి, మారంరెడ్డి కిరణ్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణా రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, దువ్వూరు సాయికృష్ణా రెడ్డి, ఇన్నమాల వెంకటాద్రి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment