దొరవారి సత్రం రవికిరణాలు న్యూస్ :- దొరవారిసత్రం మండల పరిధిలోని బూదూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులైన ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల మేరకు ఆ గ్రామంలో ఈనెల 4 తేదీన ఆ గ్రామ దళితులకు అగ్రవర్ణాల వారికి మధ్య జరిగిన వివాదంలో ఆ గ్రామ దళితులు ముగ్గురిపై కుల దూషణ కేసు నమోదు చేయాలని 5 తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి ఆ గ్రామ కాపురస్తులైన గడ్డం. ప్రభాకర్ రెడ్డి, గడ్డం వెంకటరమణారెడ్డి, గడ్డం జ్యోతి లపై కుల దూషణ కేసు నమోదు చేయడం జరిగిందన్న సమాచారం.
Post a Comment