ఎక్సైజ్ పోలీసులమంటూ బ్రాందీ షాపు నిర్వాకుని నుండి మందుతో పరార్...
దొరవారి సత్రం రవి కిరణాలు టీవీ :-పట్టపగలే ఎక్సైజ్ పోలీసుల మంటూ గురువారం నాలుగు గంటల ప్రాంతంలో దొరవారి సత్రం బ్రాందీ షాప్ నిర్వాహకుని నుండి మద్యం పట్టుకెళ్ళిన సంఘటన వెలుగు చూసింది. వివరాల మేరకు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఇనోవా కారు దొరవారిసత్రం బ్రాందీ షాప్ కు చేరుకుంది. అందులోంచి నలుగురు యువకులు దిగి బ్రాందీ షాపు నిర్వాహకుని వద్దకు వెళ్లారు. మేము ఎక్సైజ్ పోలీసులం మాకు మందు కావాలి, ఫుల్ బాటిల్ ఇవ్వండి మా లెక్కలో రాసుకోండి అంటూ నిర్వాహకునిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో షాపు నిర్వాహకుడు వారికి మందు ఇచ్చి పంపించేసి తదుపరి ఆలోచనలో పడ్డాడు. వారు నిజంగా పోలీసులా, నకిలీ కేటుగాళ్ల అనే కోణంలో ఆలోచించి వారు వెళ్ళిపోయిన తరువాత వారు ఏ నంబరు కారులో ఎంతమంది వచ్చింది ఎలా ప్రవర్తించి మద్యం పట్టుకెళ్ళిన సంఘటనపై సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అక్కడ జరిగిన సినిమా ఫక్కి తంతు చూసి మద్యం కొరకు వచ్చిన వారంతా ఆశ్చర్య పోయారు. ఏది ఏమైనా నకిలీ ఎవరు, అసలు పోలీసులు ఎవరు గుర్తించుకోకపోతున్నాము.
Post a Comment