అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి.....
దొరవారిసత్రం రవికిరణాలు న్యూస్ :- పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్న అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని తిరుపతి డిఆర్డిఏ పిడి జ్యోతి ఆదేశించారు. మంగళవారం దొరవారి సత్ర మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్ కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. తిరుపతి జిల్లాలోని సత్యవేడు, కాళహస్తి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఏసీలు, ఏపీఎం, సీసీలు, వివో ఏ అందరికీ కలిపి భారీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ ప్రతి పొదుపు మహిళా చిరు వ్యాపారాలు సాగించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తెలియజేశారు. అర్హులైన ప్రతి సభ్యురాలికి జగనన్న తోడు, చేయూత తదితర పథకాలు సక్రమంగా అందుతున్నవా లేదా అని పర్యవేక్షించాలన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని అందరూ అందుకునేలా మీరందరూ కృషి చేయాలి అన్నారు. పొదుపు సంఘాలను బలోపేతం చేస్తూ, సక్రమంగా జరిగేలా వివో ఏలు, సీసీలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం కి ఆ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు సంబంధించిన సిబ్బంది అందరూ హాజరయ్యారు.
Post a Comment