సమాజంలో ఎనలేని గౌరవం ఒక్క డాక్టర్లకు మాత్రమే ఉంటుంది: జిల్లా కలెక్టర్
తిరుపతి సెప్టెంబర్ 17: డాక్టర్లుగా సమాజంలో వైద్య సేవలు అందించి జీవితాలను కాపాడేది మీరే కనుక సమాజంలో ఎనలేని గౌరవం ఒక్క డాక్టర్లకు మాత్రమే ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు.
శనివారం ఉదయం స్థానిక రుయా ఆసుపత్రి ఆవరణలోని భువన విజయం ఆడిటోరియంలో 49వ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా మూడు రోజులు పాటు నిర్వహించనున్న కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ ఏపీ కాన్ - 20 22 ( AP APICON) తిరుపతి నగరంలో జిల్లా ఏర్పడిన తర్వాత వైద్య పరంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని హర్షించదగ్గ విషయమని అన్నారు. వైద్య విద్యార్థులు డాక్టర్లు తప్పనిసరిగా వైద్య అవగాహన కాన్ఫరెన్స్ లలో సీనియర్ డాక్టర్ల ప్రసంగాలను అనుభవాలను, సాంకేతికతను అందిపుచ్చుకొని సమాజంలో వైద్య సేవలు అందించాలని అన్నారు. వైద్యవృత్తి ఎన్నుకున్నప్పుడే పర్సనల్ లైఫ్ ప్రాధాన్యతను తగ్గించి సమాజసేవే ప్రధానమని సేవలందించాలని సూచించారు.
డాక్టర్లుగా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని కానీ ఫిజీషియన్ జీవితాన్ని కాపాడే వైద్యుడిగా మొదట రోగ నిర్ధారణ చేస్తారు కాబట్టి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఉదాహరణకు నా విషయంలోనే విశాఖపట్నంలో గొప్ప పేరున్న ఫిజీషియన్ డా.రావు వద్ద జనరల్ చెకప్ చేసుకుంటే అన్ని నార్మల్ అని వచ్చినా తన అనుభవాన్ని బట్టి యాంజియోగ్రామ్ చేయాలని సూచించారని అప్పుడు నాలుగు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించి ఆపరేషన్ చేశారని అన్నారు. జబ్బు రాకముందే గుర్తించి ముందస్తు జాగ్రత్తల వల్ల జీవితాలను కాపాడుతున్న ఫిజీషియన్ డాక్టర్లకు మరింత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. వైద్య సేవలు అందిస్తున్న మిమ్ము ప్రజలు తన హృదయాల్లో ఉంచుకుంటున్నారు అన్నారు. రాజులు రాళ్లపైన శిలాశాసనాలతో, కవులు తన రచనలతో ప్రజల మనసుల్లో ఉంటే డాక్టర్లు ప్రజల హృదయాల్లో ఉంటారనేది సత్యమని అన్నారు. వైద్య విద్యార్థులు డాక్టర్లు ఇలాంటి కాన్ఫరెన్స్ లను పూర్తిగా హాజరై వినియోగం చేసుకొని సమాజసేవ అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. జిల్లా ఏర్పడిన తరువాత స్విమ్స్ కూడా కాన్ఫరెన్స్ నిర్వహించి నందుకు ధన్యవాదాల ని ఇది వైద్య పరంగా ఇది రెండవది అన్నారు.
వివిధ మెడిసిన్ కంపెనీలు స్టాలిక్, తెలిస్టా, న్యూడ్.
జేపీ, మైక్రోల్యాబ్స్, మాక్లియోడ్స్
అస్, బయోకాన్ బయోలాజిక్స్,
జువెంటస్, గ్లెన్‌మార్క్
ఎకార్డ్ మ్యాన్‌కైండ్, అరిస్టో
తమ తయారీ మందులు స్టాల్ లు ఏర్పాటు చేశారు.
ఈ కాన్ఫరెన్స్ లో డాక్టర్లు APICON ఆర్గనైజింగ్ చైర్మన్ మునీశ్వర్ రెడ్డి సెక్రటరీ తులసీరామ్ సైంటిఫిక్ చైర్మన్ కృష్ణ ప్రశాంతి రుయా సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ స్విమ్స్ సంచాలకులు వెంగమ్మ రెండు తెలుగు రాష్ట్రాల సీనియర్ డాక్టర్లు , యూజీ పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment