బ్యాంకర్ లు సకాల౦లో లబ్ది దారులకు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్

బ్యాంకర్ లు సకాల౦లో లబ్ది దారులకు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ 

తిరుపతి, సెప్టెంబర్ 16 : 

 బ్యాంకర్ లు  లబ్దిదారులకు సకాలంలో రుణాలు మంజూరు  చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు.  శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో లీడ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 
           జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలోనీ బ్యాంకర్స్ అందురు సకాల౦లో లబ్దిదారులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. బ్యాంకర్లు అందరూ కూడా పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను  పరిశీలించి లబ్ది దారులకు రుణాలు మంజూరు చేయాలని తెలిపారు.  రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా  రాష్ట్ర ముఖ్య మంత్రి గృహప్రవేశాల కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా గృహ నిర్మాణాలు పూర్తి అయ్యేలా రుణాలను మంజూరు చేయాలని ,అర్హులైన లబ్ది దారులకు జగనన్న తోడు, స్వా నిధి, పి.ఎం.కిసాన్, మత్స్యకార భరోసా త్వరిత గతిన రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ఆక్వా మరియు మత్స్యకార రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కావున వారి  ధరఖాస్తులను పరిశీలించి రుణాలను మంజూరు చేయాలని తెలిపారు.  బ్యాంకర్లందరూ కూడా ఆదాయం వచ్చే ఇతర రుణాలను వారికి ఇవ్వగలిగితే వారి ఆర్థిక పరిస్తితి మెరుగు పడుతుందని, ఆ దిశగా రైతులకు  అవగాహన కల్పించాలని తెలిపారు. 

పి.ఎం కిసాన్ క్రాప్ లోన్స్  మరియు సాగుదారు పట్టాదారులకు సంబందించిన రుణాలను లక్ష్యానికి అనుగుణంగా రుణాలను మంజూరు చేసేలా చూడాలని తెలిపారు.  
ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆన్నారు.   బ్యాంకర్లు టిడ్కో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని పురోగతి కనిపించాలని, ఎం ఎస్ ఎం ఇ రుణాల దరఖాస్తులు పెండింగ్ లేకుండా కంట్రోలింగ్ బ్యాంకర్స్ వీటిపై చర్యలు సత్వరమే తీసుకోవాలని,  పురోగతి ఉండాలని ఆదేశించారు. 
 
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్  సుభాష్, ఆర్.బి.ఐ.ఎల్.డి.ఎం పూర్ణిమ, ఆర్.ఎం గ్రామీణ బ్యాంక్ విజయ కుమార్, డి డి ఎం  నాబార్డ్  సి. సునీల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ డి వి శర్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి దొరసాని, ఎ డి వ్యవసాయశాఖ అధికారి ధనుంజయ రెడ్డి, జి.యం,  డి ఆర్ డి ఏ, పిడి జ్యోతి, మెప్మా పి డి.రాధమ్మ,  జిల్లా మత్స్య శాఖ అధికారి  శ్రీనివాస్ నాయక్, పట్టు పరిశ్రమల శాఖ  అధికారిణి  గీతారాణి, హౌసింగ్ ఓ ఎస్ డి, పి డి  రామచంద్రా రెడ్డి, చంద్రశేఖర్ బాబు, ఏ.పి.ఎం లు, సి.సి.ఎం లు  సంబందిత బ్యాంక్ అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget