ముఖ్యమంత్రి పర్యటనలో చిన్నపాటి పొరపాట్లకు తావివ్వరాదు: జిల్లా కలెక్టర్
తిరుపతి, సెప్టెంబర్ 26: ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27,28 లలో జిల్లా పర్యటనలో చిన్న పొరపాట్లకు కూడా తావివ్వరాదని, అధికారులు కేటాయించిన విధులు అప్రమత్తంగా నిర్వహించి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ నందు విధులు కేటాయించిన అధికారులతో జేసి డి కే బాలాజీ తో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమకు కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా వుండాలని, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి పర్యటన పూర్తి సమన్వయం, విమానాశ్రయం నుండి అలిపిరి వరకు శానిటేషన్ ప్రక్రియ మునిసిపల్ కార్పోరేషన్ , గంగమ్మ గుడి వద్ద నగరపాలక సంస్థ డి.సి., తుడా సెక్రటరీ , అలిపిరివద్ద ఆర్టిసి విధ్యుత్ బస్సుల ప్రారంభం ఆర్ ఎం .ఆర్టిసి పర్యవేక్షణ వుండాలని సూచించారు. మెడికల్ అంబులెన్స్ లు , ఫైర్ సేఫ్టీ , కోవిడ్ ప్రోటోకోల్ , పోలీస్ భద్రతా ఏర్పాట్లు , విధ్యుత్ అంతరాయం వంటివి లేకుండా చూడాలని సూచించారు.
ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు. అర్దిఒ కనకనరసా రెడ్డి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసులు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Post a Comment