*లోన్ యాప్స్ బాధితులు సిపిఐ కార్యాలయాలను సంప్రదించండి*నియోజక వర్గ కార్యదర్శి ఇలపా. నాగేంద్ర బాబు.*
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారం రోజు రోజుకు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వారి మానసిక ఆందోళనలకు కారణమవుతున్నాయని అటువంటి లోన్ యాప్స్ బాధితులు ఎక్కడికక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయాలను సంప్రదించి వారి సమస్యలను తెలియజేయవలసిందిగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ పిలుపునిచ్చారని అందులో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం లో ఆన్లైన్ కాల్ మనీ బాధితులు సిపిఐ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సిపిఐ నాయకులు ఇలపా. నాగేంద్ర బాబు తెలియజేశారు. ప్రజలెవ్వరు తొందరపడి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయకుండా వుండాలని, మీకు రక్షణ కల్పించేందుకు సిపిఐ అండగా ఉంటుందని అన్నారు. మూడు రోజుల క్రితం నాయుడుపేటలో లోన్ యాప్స్ బాధితుడు హరి బలవన్మరణం తీవ్రంగా కలిచివేసిందని అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు లోన్ యాప్స్, ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే లోన్ యాప్స్, ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీల పై బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AISF నియోజకవర్గ కార్యదర్శి తేరే సూర్య, బాలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment