జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, సిడిపిఓ లకు మొబైల్ ఫోన్ల పంపిణీ.
మొబైల్ యాప్ లో ఖచ్చితత్వం తో పారదర్శకంగా వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ వివరాలు వుండాలి:- జిల్లా కలెక్టర్
తిరుపతి, సెప్టెంబర్ 19:-
జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, సిడిపిఓ లకు మొబైల్ ఫోన్ల పంపిణీ వలన
మొబైల్ యాప్ లో ఖచ్చితత్వం తో పారదర్శకంగా వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ వివరాలు నమోదు చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జయ లక్ష్మి మరియు సి డి పి ఓ లతో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు.
స్థానిక కలెక్టరేట్ లో తన ఛాంబర్ నందు సి డి పి ఓ లకు సెల్ ఫోన్లను వారి ప్రాజెక్ట్ పరిధిలోని
అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేసి ప్రస్తుతం వాడుతున్న మోబైల్ ఫోన్లలో రోజు వారి ప్రీ స్కూల్ హాజరు గర్భవతులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రంలో భోజనం గృహ సందర్శన తదితర వివరాలు YSRSP App మరియు పోషేణ ట్రాకర్ యాప్ లో పొందుపర్చుటకు ప్రస్తుతం వాడుతున్న మోబైల్ ఫోన్స్ పాత వాటి స్థానే కొత్త వాటిలో నమోదు చేయాలని తెలిపారు. పాత వాటి నుండి ఇబ్బందిని గమనించిన ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సూపర్ వైజర్ లకు నాణ్యతతో కూడిన Samsung A03 మోడల్ 2545 ఫోన్లను అంద చేసారు. వీటి వలన పారదర్శకతతో కూడిన సమాచారం అంగన్వాడీ కార్యకర్తలు అందచేయవచ్చు మరియు సూపర్ వైజర్లు పర్యవేక్షణ చేయవచ్చు తద్వారా కార్యకర్తలకు మరియు సూపర్ వైజర్లుకు పనిభారం తగ్గుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున ప్రియతమ ముఖ్యమంత్రికి అభినందనలు తెలియచేయటం జరిగింది.
Post a Comment