దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రి, విజయవాడ:- కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారిదర్శనంతో సకల శుభాలు చేకూరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం 9 గంటలకు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో మంగళవాయిద్యాలతో వేదమంత్రాల నడుమ పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఈ క్రమంలో శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గే దుర్గతి నాశని, అమ్మవారిని దర్శించుకుంటే దారిద్రములు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి, మీడియా సెంటర్‌చే జారీ చేయబడినది.
Post a Comment