దసరా బ్రహ్మోత్సవాలకు సూళ్లూరు గ్రామం నుండి చెంగాలమ్మ తల్లికి పసుపు కుంకుమ సరే తీసుకురావాలని గ్రామస్తులను కోరిన ఆల ఈవో ఆళ్ళ శ్రీనివాసరెడ్డి.
తిరుపతి జిల్లా .సూళ్లూరుపేట:-
కాలంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్యదైవం భక్తులకు బంగారం శ్రీ చెంగాలమ్మ తల్లి ఆలయంలో దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరగనున్న పూజలలో అమ్మవారి కి సూళ్లూరు గ్రామం నుండి పసుపు, కుంకుమ, సారే అమ్మవారికి సమర్పించాలని ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి గ్రామస్తులను కోరారు .దీంతో ఆనందించిన గ్రామస్తులు తప్పకుండా అమ్మవారికి పసుపు, కుంకుమ, సారే తీసుకు వస్తామని అన్నారు. అనంతరం ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసులు రెడ్డిని ఆలయ పాలకమండలి సభ్యులు కుప్పంపాటి నాగమణి, వెంకటరమణయ్య శాలువాలతో కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుదిరి ఉర్ధల్ మరియు గ్రామస్తులు ఉన్నారు.
Post a Comment