స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
 
తిరుపతి, సెప్టెంబర్ 19 :-

 స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి  అన్నారు. సోమవారం  తిరుపతి జిల్లా  కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం  అర్జీలు 125  రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 95, డి.సి.హెచ్.ఎస్ కు సంబంధించి 9,  పంచాయితీ రాజ్ శాఖ కు  సంబంధించి 5,   పి డి డ్వామా కు సంబంధించి 5,   పోలీస్ శాఖ కు సంబంధించి 2, సర్వే శాఖ కు సంబిందించి 1, హౌసింగ్ కు సంబందించి  3, ఆర్ టి సి కు  సంబందించి 1, విద్యుత్ శాఖకు సంబంధించి 1, ఆరోగ్యశ్రీ కి సంబంధించి  1, అటవీ శాఖ  కు సంబంధించి  1, పి.డి. డి.ఆర్.డి.ఏ కు సంబంధించి 1, అర్జీలు   రావడం జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget