మోదీ పాలన దేశానికి, జగన్ పాలన రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదు - మాజీ ఎంపీ చింతా మోహన్.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
దేశం లో కుల,మత,ప్రాంతాల మధ్య ద్వేషాలు పెంచుతూ బాషల మధ్య బీజేపీ ప్రభుత్వం అసమానతలు పెంచుతుందని, రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరును గురించి చిన్నపిల్లల్లాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిట్టడం శోచనీయమని ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని సీఎం జగన్ ఆకాశంలో ఉన్నారని 175 కి 175 సీట్లు గెలుచుకుంటారని అనుకోవడం అవివేకమని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో 26 సీట్లు రావడం కష్టమేనని అమరావతి రైతుల పాదయాత్రను ఉద్దేశించి మంత్రులు చేసే వ్యాఖ్యలు బాధాకరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంలో తాత్కాలిక ప్రయోజనం వైయస్ రాజశేఖర్ రెడ్డి అంత పెద్ద డాక్టర్ కాదని శాశ్వత ప్రయోజనాల రూపకల్పన వైపు సీఎం జగన్ దృష్టి సారించాలని దేశంలో మోడీ పాలన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంతా ఒకే తాటి మీదకు తీసుకురావడం లక్షంగా
ముందుకు పోతుందని మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ అన్నారు. గురువారం
స్థానిక ఆర్ &బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో చింతా మోహన్ పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ళ పాలనలో దేశానికి 8 పులులు తెచ్చారే తప్ప ఇంకేమి
చేయలేదని, ఆదానిని ప్రపంచ కుబేరుడు చేశారని పేదల ఆకలి ,నిరుద్యోగుల బాధలు ఆయనకు అర్ధం కావడం లేదని ఆయన
విమర్శించారు.దేశాన్ని బీజేపీ బ్రష్టు పట్టిస్తే ,రాష్ట్రాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో ఇసుక నుంచి గ్రావెల్ వరకు విచ్చలవిడిగా దోచుకు తింటున్నారని దోపిడి చేసింది చాలు ఇక ఆపేయండి అని వారికి పది రోజులు టైం ఇస్తున్నానని వారు దోపిడిని ఆపకుంటే అందరి బాగోతం బయటపెడతానని చింతా మోహన్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు మంచి విశేష ప్రజాదరణ లభిస్తుందని 2024లో రాహుల్ సారధ్యంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.
Post a Comment