*సచివాలయాల సిబ్బంది సేవలు మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు చర్యలు చేపాడుతాం:*
*ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించడమే సచివాలయాల ముఖ్య ఉద్దేశ్యం:*
*సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలు మరిన్ని పెంచాలి : గోపాల కృష్ణ ద్వివేది*
తిరుపతి, సెప్టెంబర్ 21: గ్రామ సచివాలయాలలో మరిన్ని సేవలను మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని, ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు అందించడమే సచివాలయం వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం అని తనపల్లి గ్రామ సచివాలయ సందర్శన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.
బుధవారం మధ్యాహ్నం తనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని, వై ఎస్ ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి తో కలిసి సందర్శించి సచివాలయ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను సిబ్బందిని అడగగా రోజుకు సుమారు 5 నుండి 8 దాకా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తదితర సేవలకు అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలుపగా, సచివాలయంలో తగినంత సిబ్బంది ఉన్నారని సేవల సంఖ్య ఇంకా పెంచాలని సూచించారు. ఈ సచివాలయం కింద కుంట్రపాకం పంచాయితీ కూడా ఉన్నదని రెంటికీ సంబంధించి 45 మంది వాలంటీర్లు ఉన్నారని తెలుపగా ప్రతి వాలంటీర్ వారి పరిధిలోని 50 ఇళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి ముంగిటకు అందేలా పని చేసి ప్రతి అర్హులైన లబ్దిదారునికి కుల మత రాజకీయాలకు అతీతంగా అందేలా పని చేయాలనీ సచివాలయానికి వారంలో కనీసం మూడు సార్లు హాజరు కావాలని సూచించారు. డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఇతర సిబ్బంది అందిస్తున్న సేవల వివరాలు అడుగగా వివిధ పథకాల లబ్దిదారులకు గైడెన్స్ ఇచ్చి వారి ఆర్జీలను ఆన్లైన్ చేయడం, స్పందన గ్రీవేన్సు ఆర్జీలను సకాలంలో పరిష్కరించడం, పాఠశాలల తనిఖీ చేసి వాటి వివరాలను కన్సిస్టెంట్ రిథం యాప్ లో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ బుకింగ్, రైతులకు విత్తనాలు, ఎరువులు వారికి వ్యవసాయ సలహాలు ఇస్తున్నామని కియోస్కు ద్వారా లబ్దిదారుల వివరాలు నమోదు చేసి వారికి విత్తనాలు, ఎరువులు అందచేస్తున్నామని తెలిపారు. ప్రజలు సంక్షేమ పథకాలు సంబంధించిన అంశాలపై దరఖాస్తులను సకాలంలో సంబంధిత శాఖలకు ఆన్లైన్లో అప్లోడ్ చేసి లబ్దిదారుల వివరాలు డిస్ప్లే చేసి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు వారికి చేరువయ్యేలా ఈ గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశారని ప్రజా సేవలకు కంకణ బద్ధులై చిత్తశుద్ధితో పని చేయాలని, సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి కొత్త వేతనాలు అందించిన ప్రభుత్వం లక్ష్యాన్ని అంది పుచ్చుకుని ప్రజలకు సేవ చేయాలనీ తెలిపారు. డిజిటల్ లైబ్రరీ లు సచివాలయాలకు అందుబాటులో ఉంటె బాగుంటుందని, ఇంటర్నెట్ కనెక్టివిటీ లాంటివి ఏర్పాటు ఉండాలని సూచించారు. సిబ్బందిని వారి సేవలను ఇంకా మెరుగైన రీతిలో ఉపయోగించుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.
Post a Comment