🔹 శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 అత్యంత వైభవోపేతంగా, ఆధ్యాత్మిక శోభతో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల నుంచి అమ్మవారి వస్త్రాలు, సారె, కుంకుమ, అభిషేక జలాలు, నెయ్యి తీసుకువచ్చాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 వేడుకగా శోభాయాత్ర నిర్వహించి అమ్మవారికి సారెని సమర్పించాం. అష్టాదశ శక్తిపీఠాల నుంచి చీరా, సారె తెప్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 రేపటి నుంచి 5 వ తేదీ వరకు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. సామాన్య భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసాం. ఆ క్యూ లైన్ లో అర్చకులు అష్టోత్తరం చేస్తారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. 9 రోజులు నేను ఆలయంలో అందుబాటులో ఉంటాను, భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 విఐపీల పేరుతో భక్తులని ఇబ్బంది పెట్టొద్దు, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు విఐపీల దర్శన సమయం కేటాయించాము. మిగిలిన సమయాల్లో విఐపీల పేరుతో వస్తే క్యూ లైన్లో వెళ్లాల్సిందే. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Post a Comment