తిరుపతి జిల్లా,సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో జరుగుతున్న
శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 5 వ రోజు బుధవారం సాయంత్రం గాండ్ల వీధి, బాపూజీ వీధి, కచ్చేరి వీధి, పార్క్ వీధి ప్రాంతాల నుండి అమ్మణ్ణికి సారె ను తీసుకొచ్చారు. ముందుగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి, ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి అక్కడకు వెళ్లి పూజలు చేసి అనంతరం మహిళలంతా కలిసి వారు తెచ్చిన సారెను తలపై పెట్టుకుని మేళతాళాలతో , కేరళ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా
ఆలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా అమ్మణ్ణి చెట్టుకు పూజలు చేసి అనంతరం ఆలయంలోని అమ్మణ్ణి సన్నిధిలోకి చేరుకొని మహిళలంతా అమ్మణ్ణి కి సారెను స్వయంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్, ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్ మండల అధ్యక్షుడు అల్లూరు, అనిల్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు కొండూరు జనార్ధన్, మీజూరు రామకృష్ణ రెడ్డి మరియు కళత్తూరు జనార్దన్ రెడ్డి, జెట్టి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment