నెల్లూరు జిల్లా ..సీతారాంపురం
సాయం చేసిన వారే వెన్నుపోటు పొడిచారు, ఏసీబీ అధికారులు ఎదుట ఎమ్మార్వో ఆవేదన
సీతారాంపురం లోని తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కాయల సతీష్ కుమార్ అయ్యవారిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బొబ్బ అంకయ్య నుండి 10000 లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులు విచా రిస్తుండగా ఆయన ఏసీ అధికారులకు కొన్ని విషయాలు విన్నవించారు. సార్ నేను మండలంలో ఎవరికి అన్యాయం చేయలేదు. గతంలో జరగని పనులు కూడా రైతుల ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలు తీరుస్తున్నాను. అని కన్నీటి పర్యాంతమయ్యారు. చేసిన పనికి వారు ప్రేమతో డబ్బులు ఇస్తే తీసుకున్న తప్పితే వారిని ఎక్కడ బలవంతం చేయలేదు అని ఏసీబీ అధికారులకు ఎమ్మార్వో విన్నవించారు....
తహసీల్దార్ ని నెల్లూరు తరలించిన ఏసీబీ అధికారులు
10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన సీతారాంపురం తాసిల్దార్ కాయల సతీష్ కుమార్ ని ఏసీబీ అధికారులు మధ్యాహ్న సమయంలో నెల్లూరు తరలించారు. ప్రస్తుతం సతీష్ కుమార్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కాసేపట్లో ఏసీబీ కోర్టులో ఆధారపరచి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
Post a Comment