*పర్యాటక కేంద్రానికి నిలయమైన తిరుపతి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం*
*ఘనంగా 21 నుంచి 27 వరకు ప్రపంచ పర్యాటక దినోత్సవాలు: జిల్లా కలెక్టర్*
*జెండా ఊపి ర్యాలిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
తిరుపతి, సెప్టెంబర్ 21 : పర్యాటక కేంద్రంగా ఉన్న తిరుపతి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం అలిపిరి నుండి 21 నుంచి 27 వరకు పర్యాటక శాఖ వారు జరిపే వారోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ర్యాలీని జెండా ఊపి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం గల దేవాలయాలతో పాటు చేరువగా సముద్ర తీరం కూడా కలిసి రావడం వలన పర్యాటక కేంద్రంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. రాబోవు రోజుల్లో తిరుపతి జిల్లాను మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ మంత్రి, తిరుపతి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఎంతో కట్టుబడి ఉన్నారని, పర్యాటక పరంగా ఇంకా అభివృద్ధి చేయడం వలన మంచి భవిష్యత్తుతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రెండు మూడు ఏళ్లలో టూరిజం హబ్ గా తిరుపతి రూపు దాల్చనున్నదని తెలిపారు ఈ 2 కే రన్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు టీ షర్టులను అందజేయడం సంతోషించదగిన విషయం అన్నారు.
ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ మురళీకృష్ణ, డివిజనల్ మేనేజర్ గిరిధర్ రెడ్డి, స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ గిరిబాబు, శిల్పారామం ఏవో ఖాదర్ వలీ, డిప్యూటీ మేనేజర్ పుష్పరాజు, సెట్విన్ మేనేజర్ మోహన్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ టూరిజం అపర్ణ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment