కెనడా లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ధూంధాం 2022 వేడుకలు*

*కెనడా లో  తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ధూంధాం 2022 వేడుకలు*

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో శనివారం రోజున గేృటర్ టోరంటో నగరంలోని కెనడా తెలంగాణ వాసులు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని Dhoom Dham 2022 ఉత్సవాలు Holy Trinity Secondary School, Oakville లో ఘనంగా జరుపుకున్నారు. సంబరాలను కార్యదర్శి, దామోదర్ రెడ్డి మాది ప్రారంభించగా,  విష్ణుప్రియ ఈద,  కవిత తిరుమలాపురం, దీప గజవాడ, రజని మాది మరియు వసంత రుద్రోజి దీప ప్రజ్వలన చేసారు. 
అనంతరము తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు *ఈద రాజేశ్వర్* మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రక్రియ లో టొరంటో నగరం నుండి TCA ఆధ్వర్యములో చేసిన కృషి ని కొనియాడారు మరియు ఫౌండేషన్ కమిటీ చైర్ వేణు రోకండ్ల, ట్రస్టీ చైర్ సంతోష్ గజవాడ, వైస్ ప్రెసిడెంట్ మన్నెం శ్రీనివాస్  కల్చరల్ సెక్రటరీ కవిత తిరుమలాపురం, ఆరంభ ప్రసంగం తో, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
*కార్యక్రమములో MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత, వర్చ్యువల్ గా TCA కార్య వర్గ సబ్యులకు, కెనడా తెలంగాణ, తెలుగు వాసులకు ధూమ్ ధామ్ 2022 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*
*తెలంగాణ యాసను సినిమా ప్రపంచానికి వాడకం లో తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు గౌరవ అతిథి తనికెళ్ళ భరణి వర్చ్యువల్ గా పాల్గొని ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి శివుడి మీద పుస్తకాలని పంపిణి చేసారు*
ముఖ్య అతిధి ధీరజ్ పరీఖ్ కాన్సుల్ జనరల్- వెల్ఫేర్, గెస్ట్ స్పీకర్ ఒంటారియో రాష్త్ర ఎంపీపీ దీపక్ ఆనంద్ విచ్చేసి TCA వారు తెలంగాణ సంస్కృతినీ భావి తరాలకు చేర్చే విధానాన్ని అభినందిస్తూ గవర్నమెంట్ అప్ప్రీసియేషన్స్ సర్టిఫికెట్ TCA ప్రెసిడెంట్ కు అందచేసారు.

*ఆకట్టుకున్న భోనాలు, మహా జాతర సమ్మక్క – సారలమ్మ*
ఈ కార్యక్రమములో తెలంగాణ సంస్కృతికి  అద్దం పట్టేల బోనాల ఊరేగింపుతో,  మేడారం తెలంగాణ మహా జాతర సమ్మక్క - సారలమ్మ ను చిలకల గుట్ట ద్వారా తీసుకు వచ్చే విధానం, శ్రీ విజయకుమార్ తిరుమలాపురం మరియు శ్రీ మూర్తి కలగోని డప్పు వాయిద్యాలతో ఘనంగా చిన్నారుల జాతర ప్రదర్శించిన తీరును సభికులను ఎంతగానో ఆకట్టుకుంది.
తదుపరి కార్యక్రమములో…..ఎత్తరాజెండా (RRR movie)ప్లే 15 మంది చిన్నారులతో కనుల విందుగా ప్రదర్శించారు.  ధీరజ్ బర్ల, లక్ష్మి సంధ్య లు, పాటల లొల్లి తో ధూమ్ ధామ్ గ సభికులను ఉర్రూతలూ ఊగించారు. TCA వారు ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ వారితో, కలర్ ఫుల్ గ ఆర్గనైజ్ చెయ్యడం పలువురు ప్రశంసించారు.  


ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, నవీన్ ఆకుల,
ఉదయ్ భాస్కర్ గుగ్గిళ్ల.  బోర్డు అఫ్ ట్రస్టీ,  శ్రీనివాస్ రెడ్డి దేపా, రాజేష్ అర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి.  ఫౌండేషన్ కమిటీ సభ్యులు  విజయ్  కుమార్ తిరుమలాపురం, కోటేశ్వర్ రావు చిత్తలూరి, శ్రీనివాస్ తిరునగరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి, శ్రీ రాహుల్ బాలినేని, కుమారి ధాత్రి అంబటి వేడుకల మాస్టర్స్ గా వ్యవహరించారు

TCA వారు తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని, రుచికరమైన భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమము స్థానిక తెలుగు వారితో సుమారు 4గంటల పాటు ప్రదర్శించటం విశేషం.  

ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞత వందన సమర్పణతో విజయవంతము గా ముగిసాయి.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget