రైతులకు బంగారు భవిష్యత్తు పవనన్న సీఎం అయితేనే సాధ్యం
రైతాంగ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు పక్కా ప్రణాళిక రూపొందించారు
జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో ఇది ఓ భాగం
పవనన్న ప్రభుత్వంలో పంటల ధరల స్థిరీకరణకు 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తాం
పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం
పంట కాలువలను ఆధునీకరిస్తాం
పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 39వ రోజున మైపాడు రోడ్డు సత్యనారాయణపురంలోని పలు విధుల్లో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్న నాయకులు ఒక్క పవన్ కళ్యాణ్ గారే అని అన్నారు. అధికారంలోకి రాకముందే రైతులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే రైతుల దశ తిరుగుతుందని కేతంరెడ్డి అన్నారు. పవనన్న ప్రభుత్వంలో రైతులకు బంగారు భవిష్యత్తు ఎలా ఇస్తామో జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో రూపొందించాం అని చెప్పారు. పంటల ధరల స్థిరీకరణకు 500 కోట్ల రూపాయలతో విధిని ఏర్పాటు చేస్తామన్నారు. టమాటా, మామిడి, పండ్లు, కూరగాయల ధరలు పడిపోయి రైతులు నష్టపోయే సందర్భంలో రైతులకు అండగా ఉంటామన్నారు. మద్దతు ధర ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గకుండా కాపాడుతామన్నారు. అవసరమైన సమయంలో ధరల స్థిరీకరణకు కేటాయించిన నిధుల నుండి రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ముఖ్యంగా టమాటా, మామిడి, పసుపు వంటి పంటల కాలంలో ధర ఒక్కసారిగా పడిపోవడం మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఇటువంటి దుస్థితి నుండి రైతులను కాపాడడానికి పంట పండే ప్రాంతాలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనే ధ్యేయంగా పని చేస్తామన్నారు. పంట దిగుబడి అనంతరం అవసరమయ్యే సాంకేతికతను రైతులకు అందిస్తామన్నారు. పంటల కటింగ్, ప్యాకింగ్, రవాణా, స్టోరేజీ, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి మూలాధారమైన పంట కాలువలను ఆధునీకరణ ఇస్తామన్నారు. ఇంతటి మేలు రైతాంగానికి కలుగాలంటే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం అని ప్రజల్ని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు.
Post a Comment