అన్నదాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ఆలయ ధర్మ కర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి
శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి దేవస్థానంలో అన్నదానం శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవాసమితి ఆధ్వర్యంలో ఈ వారం దాతలు ఊనుగుంట పాలెం గ్రామానికి చెందిన మట్టిగుంట శ్రీనివాసులు,రమణమ్మ దంపతులు 300 మంది భక్తులకు అన్నప్రసాదం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గున్న నల్లపరెడ్డి కుటుంబం
రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి దేవస్థానంలో అన్నదానం చేస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అనీ ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం కోటగ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కూడా ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ వారం దాతలగా కోట మండలం , ఊనుగుంట పాలెం గ్రామానికి చెందిన మట్టిగుంట శ్రీనివాసులు,రమణమ్మ దంపతులతో పాటు వారి పిల్లలు శ్రీకాంత్ కుమార్, గీత ఉభయదాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో అమ్మవారి దర్శనార్ధం వచ్చిన సుమారు 300 మంది భక్తులు అన్నప్రసాదన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ సందర్బంగా శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవాసమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య మాట్లాడుతూ ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సహకారంతో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొనసాగుతున్నట్లుగా చెప్పారు.ఈ కార్యక్రమానికి దాతలు ఎక్కువ చొరవచూపుతూ భాగస్వాములు అయ్యేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు,
ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో శ్రీ కోటమ్మ తల్లి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించారని, ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరిగేలా చూడాలని కోట ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి,కవిత దంపతులు, నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి రాహిన్ కుమార్ రెడ్డి, వాకా విజయ్ భాస్కర్ రెడ్డి, గాది భాస్కర్, మీజూరు మల్లికార్జున రావు,రాయపు సుబ్రమణ్యం,బల్లవోలు సుధాకర్ స్వామి, సురేష్ బాబు, కిషోర్ బాబు, సమరతసేవా పౌండేషన్ అద్యక్షులు నారాయణ రెడ్డి, పన్నగ సాయి, శ్రీరాంసుధాకర్, ఉద్దండి ధనుంజయ్య ఆచారి, ట్రస్ట్ సభ్యులు అల్లం సాయిరాం తదితరులుపాల్గొన్నారు.
Post a Comment